English   

నిహారిక, వరుణ్ తేజ్ పెళ్లిళ్లపై నాగబాబు క్లారిటీ..

Naga Babu
2020-05-14 13:09:03

మెగా ఇంట్లో త్వరలోనే పెళ్లి సందడి మొదలు కాబోతుంది. ఆ ఇంటిలో వరుసగా రెండు పెళ్లిళ్లు జరగబోతున్నాయి. అది కూడా ప్రత్యేకంగా నాగబాబు ఇంట్లో. ఆయన కుమారుడు, కూతురు పెళ్లిళ్లు త్వరలోనే చేస్తానని చెప్పాడు నాగబాబు. అందులో ముందుగా నిహారిక పెళ్లి 2021 ప్రథమార్ధంలో ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే అబ్బాయిని వెతుకుతున్నామని.. మంచి వాడు దొరికితే పెళ్లి చేయడమే తరువాయి అంటున్నాడు నాగబాబు. తనకు కులం పట్టింపులు కూడా లేవు అంటున్నాడు. ఇక మరోవైపు వరుణ్ తేజ్ పెళ్లి కూడా త్వరలోనే చేస్తామని చెప్పాడు. నిహారిక పెళ్లి జరిగిన ఏడాదిలోపే వరుణ్ కు కూడా పెళ్లి చేసి తన బాధ్యతలు తీర్చుకుంటానని చెబుతున్నాడు మెగా బ్రదర్. 

విషయంపై వరుణ్ తేజ్ తో కూడా మాట్లాడానని.. కాకపోతే కెరీర్ పరంగా సెట్ అయిన తరువాత పెళ్లి చేసుకుంటానని తనకు చెప్పినట్లు నాగబాబు చెబుతున్నాడు. ఈ లోపు మంచి మంచి సంబంధం చూసి నిహారికకు పెళ్లి చేస్తామని కన్ఫర్మ్ చేశాడు. ఇప్పటికే ఈ విషయాన్ని నిహారికకు చెప్పినట్టు తెలిపాడు నాగబాబు. గతేడాది అడిగినప్పుడు ఒక ఏడాది సమయం కావాలి అని తనను అడిగిందని.. వెబ్ సిరీస్ లతోపాటు సినిమాల్లో కూడా నటిస్తానని చెప్పిందని క్లారిటీ ఇచ్చాడు నాగబాబు. ఇప్పుడు నిహారిక అడిగిన సమయం పూర్తయిందని అందుకే మంచి కుర్రాడి కోసం వెతుకుతున్నట్లు చెప్పాడు ఈయన. 2022 ప్రథమార్థంలో వరుణ్ తేజ్ పెళ్లి జరుగుతుందని కన్ఫర్మ్ చేశాడు నాగబాబు. 

More Related Stories