English   

ప్రభాస్ ను ఒంటరి చేసిన రానా దగ్గుబాటి..

 Rana daggubati
2020-05-14 17:47:11

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇదే ప్రచారం జరుగుతుంది. బావా బావా అంటూ ఎప్పుడు పక్కనే ఉండే రానా ఇలా సడన్ గా పెళ్లి కొడుకు కావడం అందరికీ షాక్ ఇస్తుంది. మరీ ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఈ విషయం తెలుసుకొని షాక్ అవుతున్నారు. ఓవైపు సంతోషపడుతూ.. రానా దగ్గుబాటికి కంగ్రాట్స్ చెబుతూనే తమ హీరోను కూడా పెళ్లికి ఒప్పించాలి అంటూ కోరుకుంటున్నారు. ఈ ఏడాది చాలా మంది హీరోలు పెళ్లి చేసుకుంటున్నారు. ఇక నితిన్ కూడా ఇదే ఏడాది పెళ్లి చేసుకుంటున్నాడు. సాయి ధరమ్ తేజ్ కూడా తమ ఇంట్లో అమ్మాయిని వెతికే పనిలో పడ్డారని.. ఇదే ఏడాది పెళ్లి చేసుకుంటాను అని క్లారిటీ ఇచ్చాడు. రానా దగ్గుబాటి సైతం డిసెంబర్లో ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. దాంతో ప్రభాస్ ఒక్కడే ఒంటరిగా మిగిలిపోతాడు.. అందుకే ఆయనకు కూడా త్వరగా పెళ్లి చేయాలి అంటూ కృష్ణంరాజుకు సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు రిక్వెస్ట్ పెడుతున్నారు. తమ హీరోను త్వరగా ఇంటివాణ్ణి చేయండి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా రానా దగ్గుబాటిని అయితే ప్రభాస్ అభిమానులు ఆటపట్టిస్తున్నారు. ఎప్పుడు బావా బావా అంటూ పిలుస్తూ నువ్వు మాత్రం పెళ్లి చేసుకుంటున్నావు.. మరి మీ బావ సంగతి నువ్వు చూడవా అంటూ అడుగుతున్నారు.  

More Related Stories