English   

రానాకు కాబోయే భార్య గురించి ఆసక్తికరమైన విషయాలు..

miheeka bajaj
2020-05-14 18:15:01

మిహీక బజాజ్.. ఈ పేరు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఎవరు ఈమె.. ఎక్కడి నుంచి వచ్చింది అంటూ అందరూ ఆరా తీస్తున్నారు. దానికి కారణం రానా దగ్గుబాటి ఈమె ప్రేమలో పడటమే. ఇదే ఏడాది ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. దాంతో అసలు ఎవరు ఈ అమ్మాయి అంటూ అందరూ  తెగ వెతికేస్తున్నారు. హైదరాబాద్ మూలాలు కలిగిన ఈ అమ్మడు ఒక యంగ్ బిజినెస్ లేడీ. డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో పేరుతో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ మరియు డెకరేషన్ సంస్థలను నడుపుతుంది. హైదరాబాద్ అమ్మాయి అయిన ఈ అమ్మడుకి ఇండియన్ ఆర్కిటెక్చర్ పై ఉన్న మక్కువతో అటు వైపు అడుగులు వేసింది. 

ప్రస్తుతం ముంబై నుంచి బిజినెస్ కార్యకలాపాలు నడిపిస్తుంది బజాజ్. ఇంటీరియర్ డిజైన్ ఆర్కిటెక్చర్ పై ఆకర్షణతో ముంబైలోని రచన సన్సాద్ అనే విద్యా సంస్థ నుండి ఇంటీరియర్ డిజైన్ లో డిప్లొమా పూర్తి చేసింది. లండన్ లోని చెల్సియా యూనివర్సిటీ నుండి ఎమ్ఏ డిగ్రీ ఆర్ట్ మరియు డిజైన్ విభాగంలో డిగ్రీ పొందింది మిహీక బజాజ్. ఆయన కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే మిహీక బజాజ్ తల్లిదండ్రులు హైదరాబాద్ లోనే ఉంటారు. ఇద్దరు పెద్ద బిజినెస్ మెన్. తల్లి పేరు బంటీ బజాజ్ కాగా తండ్రి పేరు సురేష్ బజాజ్. 

ఇక్కడ విచిత్రం ఏంటంటే అమ్మాయి తండ్రి పేరు కూడా సురేష్. వీళ్లకు హైదరాబాద్ లో క్రాసల అనే ఓ జ్యువలరీ బ్రాండ్ ఉంది. తల్లి బంటీ బజాజ్ వృత్తి రీత్యా జ్యువలరీ డిజైనర్. మిహిక బజాజ్ కు సామ్రాట్ అనే సోదరుడు ఉన్నాడు. ఆయన క్రాసల జ్యువలరీ బ్రాండ్ మానేజ్మెంట్ చూసుకుంటున్నారు. డెకార్ వర్క్ అంటే మిహీక బజాజ్ కు ప్రాణం. చిన్నప్పటి నుండి డెకార్ వర్క్ చూస్తే పెరిగిన ఆమెకు క్రియేటివ్ పర్సన్స్ కి అద్భుతమైన రంగం అంటారు. మొత్తానికి గత రెండు రోజులుగా ఈమె సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇదే ఏడాది రానా పెళ్లి జరుగుతుందని సురేష్ బాబు వెల్లడించాడు. 

More Related Stories