English   

దెయ్యాలతో దోస్తానా.. ఇప్పట్లో వదలవా లారెన్స్ బాబు..?

raghava
2020-05-15 07:48:24

కామెడీ సినిమా అంటే రాజేంద్ర ప్ర‌సాద్.. డాన్స్ అంటే ప్ర‌భుదేవా.. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా చూడాలంటే చిరంజీవి.. స్టైల్ తో క‌ట్టి ప‌డేయాలంటే ర‌జినీకాంత్.. ఇలా ఒక్కో పేరు చెబితే ఒక్కో జోన‌ర్ మ‌న క‌ళ్ల ముందు నిలుస్తోంది. అలాంటి ఓ బ్రాండ్ కోస‌మే ఇప్పుడు లారెన్స్ కూడా ట్రై చేస్తున్నాడు. అయితే అంద‌రిలా మాస్ క్లాస్ ఇమేజ్ కోసం కాకుండా.. డెవిల్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు లారెన్స్. అవును.. మీరు విన్న‌ది కాస్త వింత‌గా ఉన్నా ఇదే నిజం. లారెన్స్ అంటే కేరాఫ్ డెవిల్స్ అనేలా మార్చేస్తున్నారు. దీనికి ఆయ‌న స‌హ‌కారంతో పాటు ప‌క్క ద‌ర్శ‌కుల సాయం కూడా తోడ‌వుతోంది. ముని సినిమాతో తొలిసారి దెయ్యాల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు లారెన్స్. ఆ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో కాంచ‌న తీసి మ‌రో హిట్ కొట్టాడు.

ఇందులోనూ దెయ్యాల‌తోనే దోస్తీ చేసాడు లారెన్స్. గంగతో లారెన్స్ కు దెయ్యాల రిలేష‌న్ మ‌రింత బ‌ల‌పడిపోయింది. అందులో నాలుగో భాగం కూడా చేసాడు. కాంచన 3 కూడా మంచి విజయం సాధించింది. ముని సిరీస్ లో ఐదో భాగం కూడా చేస్తున్నాడు. ఇందులోనూ దెయ్యాల‌దే కీ రోల్ అని చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమాను 50 కోట్ల‌తో తెర‌కెక్కిస్తున్నాడు లారెన్స్. ఇది చాల‌ద‌న్న‌ట్లు.. లారెన్స్ కు బ‌య‌టి ద‌ర్శ‌కులు కూడా దెయ్యాల సినిమాలే ఆఫ‌ర్ చేస్తుండ‌టం విశేషం. చంద్ర‌ముఖితో సెన్సేష‌న్ సృష్టించిన పి వాసు.. ఈయనతో త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. ఇది వరకే ఈ కాంబినేషన్ లో శివగంగ అనే సినిమా వచ్చింది. అది కూడా దెయ్యాల సినిమానే. ఇప్ప‌టికే దెయ్యాల‌తో బాగా క‌నెక్ట్ అయిపోవ‌డంతో త‌న క‌థ‌కు లారెన్స్ అయితేనే న్యాయం చేస్తాడ‌ని న‌మ్ముతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. మొత్తానికి లారెన్స్ ను దెయ్యాలకు మ‌రింత ద‌గ్గ‌ర చేస్తున్నారు మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు.

 

More Related Stories