English   

రాజమౌళి నా దేవుడు.. ఒక్క సినిమాతో అప్పులన్నీ ఫట్..

rajamouli
2020-05-15 08:02:54

తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి చాలా మందికి లైఫ్ ఇచ్చాడు. ముఖ్యంగా ఆయన సినిమాల్లో నటించే విలన్స్ ఒక్కసారిగా టాప్ ప్లేస్ కు వెళ్లిపోతారు. సై సినిమాలో ప్రదీప్ రావత్ దీనికి నిదర్శనం. బిక్షూ యాదవ్ గా ఇప్పటికీ ఈయన తెలుగు ఆడియన్స్ కు పరిచయం. ఆ తర్వాత మర్యాద రామన్న సినిమాతో ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా ఎవరూ గుర్తు పట్టని నాగినీడుకు లైఫ్ ఇచ్చాడు. అదే సినిమాలో ప్రభాకర్ కూడా అంతే. ఆయనకు కూడా మంచి పాత్ర ఇచ్చి లైఫ్ టర్న్ చేసాడు. ఆ వెంటనే బాహుబలిలో కాలకేయ పాత్రతో ఆయన స్టార్ అయిపోయాడు. ఆ సినిమా ముందు వరకు కూడా ఊళ్లో ఈయనకు చాలా అప్పులు ఉండేవి. మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చిన ప్రభాకర్.. బాహుబలికి ముందు కొన్ని సినిమాలు చేసినా కూడా గుర్తింపు తెచ్చుకోలేదు. కానీ రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్నతో పాటు బాహుబలి ఈయన జీవితాన్ని మార్చేసాయి. అందుకే తన కొడుకుకు కూడా రాజమౌళి పేరు పెట్టుకున్నాడు ఈయన. దాంతో పాటే ఈయన నా దేవుడు అంటున్నాడు ప్రభాకర్. బాహుబలి సినిమాతో తన అప్పులన్నీ తీరిపోయాయని చెప్పాడు ప్రభాకర్. ఇప్పటికీ ఎప్పటికీ రాజమౌళికి రుణపడిపోయి ఉంటానని చెప్పాడు ఈయన. తనకు కనిపించే దేవుడు అంటే రాజమౌళి ఒక్కడే అంటున్నాడు ప్రభాకర్.

More Related Stories