తీవ్ర విషాదంలో అనుష్క ఫ్యామిలీ

ఒకప్పటి అండర్ వరల్డ్ డాన్, సినీ నటి అనుష్కకి సమీప బంధువు అయిన ముత్తప్ప రాయ్ కన్నుమూశారు. ఒకప్పుడు అండర్ వరల్డ్ డాన్ గా ఉన్న ఆయన ఆ తరువాత మంచిగా మరి పోయి సంఘ సేవకుడిగా మారిపోయారు. ఆ తురువాత ఆయన కర్నాటక అట్లేతిక్స్ అసోసియేషన్ ని స్థాపించి దానికి ప్రెసిడెంట్ గా ఉన్నారు. అయితే రాయ్ ఆరోగ్యం విషమంగా ఉందని నిన్నటి నుండి ప్రచారం జరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం 68 ఏళ్ల ముత్తప్ప బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున రెండు గంటల సమయంలో కన్నుమూశారు. కొద్ది నెలలుగా ఆయన కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్టు చెబుతున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం రాత్రి ఆసుపత్రిలో చేర్చారు. ఇక ఆయన ఈ ఏడాది జనవరిలో తాను బ్రెయిన్ కేన్సర్‌తో బాధపడుతున్నట్లు ప్రపంచానికి తెలియచేశారు. తన ఆస్తులకు సంబంధించిన వీలునామా రాసి, తన పిల్లలకు తెలియ జేసినట్లు కూడా ఆయన ప్రకటించారు. ఇక ఈయన అనుష్క కుటుంబానికి చాలా దగ్గర మనిషి. అప్పట్లో అనుష్క దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో పూజలు జరిపితే ఈయన అనుష్క వెంటే అన్ని పూజల్లో పాల్గొన్నారు. ఇక ఆయన ఇలా కన్నుమూయడంతో అనుష్క ఫ్యామిలీ తీవ్ర విషాదంలో ఉందని చెబుతున్నారు. ఇక ముత్తప్ప రాయ్ జీవిత నేపధ్యాన్ని 'రాయ్' అనే టైటిల్ తో తెరకెక్కించనున్నట్టు అప్పట్లో వర్మ ప్రకటించాడు. ఈ సినిమాలో వివేక్ ఒబరాయ్ ప్రధాన పాత్ర పోషిస్తాడని అప్పట్లో ప్రకటించారు. అయితే ఎందుకో కానీ ఆ సినిమా మళ్ళీ తెరకెక్క లేదు.