English   

బాలీవుడ్ సినిమా కోసం త్రివిక్రమ్ కి షాకిచ్చిన ఎన్టీఆర్ 

Jr NTR
2020-05-15 09:47:42

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఎన్టీఅర్ తదుపరి సినిమా ఉంబోతున్నట్టు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా హారిక అండ్ హాసిని మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పై రాధా కృష్ణ, కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. రకరకాల పేర్లు అయితే వినిపిస్తూ వచ్చాయి కానీ ఎవరి పేరును ఇంకా ఫైనల్ చేయలేదు. ఇక ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్‌ లో ప్రచారం జరుగుతోంది. 

అదేంటంటే ఈ సినిమా ఇప్పట్లో ఉండక పోవచ్చని అంటున్నారు. ఎందుకంటే తెలుగు హీరోలు అందరూ ప్యాన్ ఇండియా లెవల్ లో మార్కెట్ పెంచుకుంటున్నారు. ప్రభాస్ మొదలు అల్లు అర్జున్, రానా లాంటి వాళ్ళు ఇప్పటికే ఆ కోవలో ముందడుగు వేశారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ దెబ్బకు ఎన్టీఆర్ కూడా ప్యాన్ ఇండియా లెవల్ కి వెళ్తాడు. అయితే ఆ సినిమా అయిన వెంటనే బాలీవుడ్ సినిమా చేయాలని చూస్తున్నట్టు చెబుతున్నారు.  బాలీవుడ్ లో స్టార్ ద‌ర్శకుడయిన సంజ‌య్ లీలా బన్సాలీతో ఆయన సిని చేసే అవకాశం ఉందని టాక్. త్రివిక్రమ్ కంటే ముందు ఆ సినిమా చేస్తే బాగుంటుందని ఆయన భావిస్తున్నాడని అంటున్నారు. అందుకే ఆ సినిమా కోసం దాదాపుగా త్రివిక్ర‌మ్‌ సినిమాను పక్కన పెట్టేసాడట తారక్. చూడాలి మరి ఈ వార్తలో నిజం ఎంత ఉంది అనేది. 

More Related Stories