English   

ఆమెజాన్ లో నేరుగా కీర్తి సినిమా...భలే ప్లాన్ చేసిన కార్తిక్ సుబ్బరాజ్

 Keerthys Penguin
2020-05-15 11:11:39

కరోనా కల్లోలంతో అన్ని రంగాల లానే సినిమా రంగం కూడా ఇబ్బంది పడుతోంది. నిరంతరం సినిమాలు, షూటింగ్ లు, ప్రమోషన్స్ అంటూ అనునిత్యం బిజీగా ఉండే సినిమా స్టార్లు ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే ఇప్పట్లో కరోనా తగ్గేలాగా కనిపించడం లేదు. అయితే ఒకవేళ కరోనా వలన విధించిన లాక్ డౌన్ ఎత్తివేసినా ఇప్పట్లో సినిమా థియేటర్స్ పూర్హ్తి స్థాయిలో పని చేసే దారి కనపడడం లేదు. అందుకే కొందరు సినిమాలను నేరుగా ఓటీటీలలో రిలీజ్ చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే తెలుగులో ఒక సినిమా జీ5 లో రిలీజ్ చేయగా అది పెద్దగా బాగోక పోవడంతో పెద్దగా హైలైట్ కాలేదు. అయితే ఇప్పుడు కీర్తి సురేష్ నటించిన సినిమాని ఆమెజాన్ లో రిలీజ్ చేస్తున్నారు. మ‌హాన‌టి త‌రువాత కీర్తి చేసిన సినిమాలలో పెంగ్విన్ సినిమా ఒకటి. ఆస‌క్తిక‌ర క‌థ‌, క‌థ‌నం తెరకెక్కించిన ఈ సినిమాని ఈశ్వర్ కార్తిక్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించారు. స్టోన్ బెంచ్ ఫిల్మ్ బ్యానర్ మీద పెట్టా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాను నిర్మించారు. 

అయితే ఇప్పట్లో థియేటర్ రిలీజ్ కుదిరే పని కాదని భావించి పెంగ్విన్ సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియోకి అమ్మేశారు. దీంతో ఈ సినిమా నేరుగా అమెజాన్ ప్రైమ్ లోనే విడుద‌ల కానుంది. అలాగే అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్న తొలి తెలుగు సినిమా పెంగ్వీన్ కావడం మరో విశేషం. పెంగ్విన్‌ సినిమాలో కీర్తి ఓ ప్రయోగాత్మక పాత్రను పోషించబోతున్నట్లు అప్పట్లో రిలీజ్ చేసిన పోస్టర్‌ ద్వారా క్లారిటీ వచ్చింది. గతేడాది అక్టోబర్ లో విడుదలైన ఈ పోస్టర్ లో కీర్తి డార్క్‌ షేడ్‌లో గర్భవతిగా ఉన్నట్టుగా దర్శనమిచ్చింది. బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో ఆమె రూపం పెంగ్విన్ పక్షిలా ఉంది.  ఈ సినిమాని తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలోనూ మూవీని విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమా మిగతా బాషలలో కూడా ఆమెజన్ లోనే విడుదల కానుంది.

More Related Stories