English   

రామ్ డించక్ డించక్ సాంగ్..హెబ్బా పటేల్‌ తో రచ్చ 

Ram Pothineni
2020-05-15 12:31:05

కరోనా వల్ల ప్రపంచమే స్థంబించింది. ఇక సినిమాలు ఒక లెక్కా, సినిమా థియేటర్లు సహా షూటింగ్ లు అన్నీ వాయిదా పడ్డాయి. ఇక థియేటర్స్ లేకుంటే రిలీజ్ లు కూడా ఉండవు కదా. ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. ఆ దెబ్బకి ఈ రెండు నెలల్లో రిలీజ్ కావాల్సిన సినిమాలు మొత్తం వాయిదా పడినట్టే. నిన్న సాయంత్రం మళ్ళీ లాక్ డౌన్ డేట్ కూడా పొడిగించారు. దీంతో ఇక ఈ నెల మొత్తం కొత్త సినిమాలను చూసే అవకాశం లేనట్టే. దీంతో ఒక రకంగా సినిమాలకి సంబందించిన అప్డేట్స్ కూడా లేకుండా పోయాయి. అయితే ఈరోజు రామ్ పుట్టిన రోజు కావడంతో అభిమానులకి తన బర్త్ డే కి గిఫ్ట్ ఇచ్చాడు రామ్. రామ్ హీరోగా తిరుమల కిశోర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా రెడ్.

రామ్, నివేతా పేతురాజ్, మాళవికా శర్మలు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నుంచి డించక్ సాంగ్ టీజర్ ఈరోజు రామ్ పుట్టినరోజు విడుదల చేశారు. ఇక ఈ సాంగ్ కోసం మణిశర్మ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంతోంది. రామ్, హెబ్బా పటేల్‌ మీద షూట్ చేసిన ఈ స్పెషల్ సాంగ్ కి రెస్పాన్స్ అదురుతోంది. రాములో రాములా సాంగ్ ఇచ్చిన కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను సింగర్స్ సాకేత్, కీర్తన శర్మలు తమ గాత్రంతో మరో మెట్టు ఎక్కించారు. యుట్యూబ్ లో ఈ వీడియో ట్రెండ్ అయినా ఆశ్చర్యం లేదు. మీరు కూడా చూసేయండి మరి.

More Related Stories