English   

పవన్ ప్లాన్స్ ని పాడు చేసిన కరోనా..

 Pawan Kalyan
2020-05-15 13:10:07

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక మనదేశంలో లాక్ డౌన్ వలన సినీ ప్రముఖులు అయితే కొందరు రెస్ట్ తీసుకుంటుంటే మరి కొందరేమో ఆందోళనలో ఉన్నారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఒకేసారి మూడు సినిమాలు ఒప్పుకుని చేసుకుంటూ పోతున్నారు. మూడు సినిమాల్లో క్రిష్ తో కూడా ఒక సినిమా చేస్తున్నారు. అయితే ఆయన రీఎంట్రీ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌ వకీల్ సాబ్ ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకోగా వేసవి కానుకగా మే 15న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే కరోనా దెబ్బకు ఆ ప్లాన్ అంతా అప్సెట్ అయింది. అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఈ రోజు థియేటర్స్ అన్నీ విజిల్స్ తో మార్మోగిపోయేవి. కానీ కరోనా వచ్చి మొత్తం ఆ ప్లాన్స్ అన్నిటినీ స్మాష్ చేసేసింది. లాక్‌డౌన్ కారణంగా అన్నీ ఆగిపోవడంతో పరిస్థితులు మెరుగుపడిన తర్వాత వకీల్ సాబ్ మిగిలిన వర్క్ పూర్తి చేసి ఆ తరువాత క్రిష్ సినిమాను చేయాలని చూస్తున్నాడు పవన్. నిజానికి ముందు క్రిష్‌తో పాటే హరీష్ శంకర్ సినిమాను కూడా ప్యారలల్ గా పూర్తి చేయాలనుకున్నాడు పవన్. కానీ ఇఫ్పుడు అలా కాకుండా క్రిష్ సినిమాను పూర్తి చేసిన తర్వాతే హరీష్ శంకర్ సినిమా చేయాలని భావిస్తున్నాడట పవన్. 2022 దాకా ఈ మూడు సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుని ఆ తర్వాత మళ్లీ రాజకీయాల్లో బిజీ కావచ్చని అంటున్నారు.  

More Related Stories