ఏపీలో త్వరలో ఓపెన్ కానున్న థియేటర్లు ?

కరోనా క్రైసిస్ తో సినిమా ఇండస్ట్రీ మీద కోలుకోలేని దెబ్బపడినట్టే కనిపిస్తోంది. రెండు వారాలు అనుకున్న లాక్ డౌన్ ఇప్పుడు మరో ఇరువై రోజులకు పెరిగింది. దీంతో ఆడియన్స్ తో అనునిత్యం కళకళలాడే థియేటర్స్ నిర్మానూహ్యంగా మారిపోయాయి. ప్రేక్షకుల కిటకిటలతో సందడిగా ఉండే సినిమా హాళ్ళు, మాల్స్ వెలవెలబోతున్నాయి. కరోనా ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో... ఎప్పుడు పరిస్థితి నార్మల్ స్టేజ్‌కు వస్తుందో తెలీని పరిస్థితి. వచ్చిన తర్వాత ఏం చేయాలన్న ప్లాన్‌లో సినిమా ఇండస్ట్రీ వుంది. కరోనాతో భయపడిపోయిన జనాలను మళ్లీ థియేటర్స్‌కు రప్పించడం ఎలా? సినిమాలను ఏ పద్ధతిలో రిలీజ్ చేయాలి. టిక్కెట్ రేట్లు తగ్గించాలా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఇండియన్ సినీ ఇండస్ట్రీ ముందు ఉన్నాయి.
కరోన తగ్గు ముఖం పట్టి ఒక వేళ లాక్ డౌన్ మే నెలలో ఎత్తేసినా జనాన్ని ఇప్పట్లో గుంపులుగా అనుమతించే పరిస్థితి లేదు కనుక జూన్ లేదా జులైకి థియేటర్స్ మళ్ళీ రెడీ అయ్యే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే ఆర్థిక పరంగా దెబ్బ తింటున్న కారణంగా కొద్ది రోజుల ముందే కేంద్రం కొన్ని మినహాయింపులతో సడలింపులు ఇచ్చింది. ఇప్పటిదాకా కిరాణా షాపులు, పాల దుకాణాలు, లిక్కర్ షాపులు పరిమిత సమయంలో మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. అయితే ఇప్పుడు సినిమా హాళ్లు, రెస్టారెంట్లు కూడా తెరుచుకోబోతున్నాయని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యా సంస్థలు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు ప్రారంభించేందుకు అక్కడి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.