English   

మాస్కుతో పెళ్ళేందుకు ? ఆగలేకపోతున్నారా ? నటీమణి సంచలన పోస్ట్

madhavi
2020-05-16 07:28:29

అసల్ ఆగట్లేదుగా జనాలు, మాస్క్ లు వేసుకుని పెళ్ళిళ్ళు ఎందుకు ? ముహూర్తం మళ్ళీ రాదా ? ఇది పోతే శ్రావణం..కాకపోతే మాఘ మాసం. లేకుంటే మరో ఏడాది. పిల్ల దొరకదా ? పిల్లోడు మారిపోతాడా ? అలా మారిపోతే మారిపోయే మనుషులతో బంధాలు ఎందుకంటా ? మాస్క్ ముసుగుల్లో పెళ్లి అవసరమా ? కొన్నాళ్ళు ఆగలేని సంసారాలు చేస్తారా ? ఫిక్స్ అయిన పెళ్ళిళ్ళలో గ్యాప్ వస్తే నిజాలు తెలిసే బంపర్ ఆఫర్ మిస్ అవుతున్నారు. సచ్చిపోతున్నార్రా నాయనా అంటే ఈ పెళ్లి ఏందో ఉఫ్ నాకు అర్ధం కావడం లేదు. జనాలు క్రేజీ సారీ సారీ దేవుడు క్రేజీ !

ఇది ఒక నటీమణి తన ఫేస్ బుక్ లో చేసుకున్న పోస్ట్. దానికి కింద నోట్ కూడా రాసిందండోయ్ నా పోస్ట్ నా ఇష్టం నా ఒపీనియన్ నా ఇష్టం..నాకు నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసే హక్కుంది.ఇది చదువుతుంటే మీకు మండచ్చుగాక అయితే ఏంటి ఆవిడ హక్కట. ఇదంతా రాసింది ఎవరంటే నచ్చావులే అనే ఒక సినిమాలో హీరోయిన్ గా చేసి, ఇప్పటికీ తాను స్టార్ హీరోయిన్ అని ఫీలయ్యే నటి మాధవీ లత. మనం మంచోళ్ళం అయితే ప్రపంచాన్ని మనం చూసే ద్రుష్టి కోణం మంచిగానే ఉంటుంది. ఇంకో పార్ష్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె ఎవరినీ స్వయంగా ప్రస్తావించలేదు కానీ ఈమె ఈ పోస్ట్ ఎవరిని గురించి పెట్టి ఉండచ్చో ? మీకు అర్ధం అయ్యే ఉంటుంది. ఈ మధ్య అయిన పెళ్ళిళ్ళు అంటే దిల్ రాజుది, హీరో నిఖిల్ ది అయ్యాయి. ఈ పెళ్ళిళ్ళ మీదనే నటి మాధవీలత ఇన్ డైరెక్ట్ అటాక్ చేస్తూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టింది.  నెటిజన్లు అంతా హీరో నిఖిల్ పెళ్లి గురించేనా అంటూ ప్రశ్నించగా.. దానికి ఏమో అంటూ దాటవేసే ప్రయత్నం చేసింది.

 

More Related Stories