English   

షూటింగ్స్ చేసుకోండి కానీ కండీషన్స్ అప్లై..

shoot
2020-05-16 08:21:47

కరోనా కారణంగా గత రెండు నెలలుగా షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. దాంతో వేలాది మంది సినీ కార్మికులు పనిలేక పస్తులుంటున్నారు. థియేటర్స్ కూడా అన్నీ మూత పడిపోయాయి. ఈ లాక్ డౌన్ తో ఇండస్ట్రీ వేల కోట్లు నష్టపోయింది. ఇప్పుడు దీన్ని పూడ్చడం కూడా అంత ఈజీ కాదు. ఈ ప్రభావాన్ని కాస్తైనా తగ్గించడానికి మార్గాలను అన్వేషిస్తుంది ప్రభుత్వం. ఇక దర్శక నిర్మాతలు కూడా ఎలాగోలా తమకు షూటింగ్ చేసుకునే వెసలుబాటు కల్పించాలని కోరుకుంటున్నారు. దాంతో షూటింగ్ లకు అనుమతులు మంజూరు చేయడానికి కూడా కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే దీనికి చాలా కఠినమైన ఆంక్షలు కూడా పెట్టడానికి సిద్ధమవుతుంది. ముఖ్యంగా సినిమా యూనిట్ మొత్తం సినిమా కరోనా వైరస్ బారిన పడదని ధృవీకరణ పత్రంతో రావాలి..

అప్పుడు కానీ షూటింగ్స్ కు అనుమతి ఇవ్వరు. ఇక కరోనా వైరస్ కారణంగా తారాగణం లేదా సిబ్బంది నుండి ఎవరైనా చనిపోతే.. ఈ చిత్ర నిర్మాతలు మరణించిన వాళ్ల కుటుంబానికి 50 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలి. ఇక సెట్స్ లో కూడా అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే నిర్మాతలకు ఇది భారీ భారం తప్పకపోవచ్చు. ఇదే మార్గ దర్శకాలు చిన్న సినిమాలతో పాటు టీవీ సీరియల్ షూటింగ్స్ కు కూడా వర్తిస్తాయి. అయితే ప్రభుత్వం ఇంత కఠినమైన నిర్ణయాలతో వస్తే మాత్రం కచ్చితంగా మరికొన్నాళ్లు అయిన తర్వాతే షూటింగ్స్ కు వెళ్లాలనే ఆలోచనలో చిన్న నిర్మాతలు ఉన్నారు. ఎందుకంటే షూటింగ్ అయితే ఒక్కరిద్దరితో అయ్యేది కాదు.. వందలాది మంది కార్మికులు ఉంటారు. అందులో ఎవరి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టమే. అనుకోనిది ఏదైనా జరిగితే నిర్మాతకు పెనుభారం కాక తప్పదు.

 

More Related Stories