English   

నువ్వు తీసేది బాహుబలి కాదమ్మా.. అగ్ర దర్శకుడిపై ఇండస్ట్రీలో సెటైర్లు..  

Tollywood
2020-05-16 13:52:39

తెలుగు ఇండస్ట్రీలో ఆయన ఓ మాస్ డైరెక్టర్.. 15 ఏళ్లుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్టు ఫ్లాపులతో పని లేకుండా మాస్ డైరెక్టర్ ఇమేజ్ అయితే సంపాదించుకున్నాడు. ఈ మధ్యే భారీ ఫ్లాప్ ఇచ్చి రేసులో వెనకబడిపోయాడు ఆ దర్శకుడు. ఇలాంటి సమయంలో మళ్లీ మాస్ మసాలా సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. తనకు అచ్చొచ్చిన ఓ సీనియర్ హీరోతోనే సినిమా చేస్తున్నాడు కూడా. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టాడు. వారణాసి వెళ్లి ఓ షెడ్యూల్ తీసిన వెంటనే కరోనా వచ్చి ఆగిపోయింది. మరోవైపు ఆ హీరో సినిమాలు కూడా దారుణంగా ఫ్లాప్ అవుతున్నాయి కొన్నేళ్ల నుంచి. దాంతో ఇఫ్పుడు ఈ కాంబినేషన్ పైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అంచనాలు అయితే ఉన్నాయి కానీ గతంలో పెట్టినట్లు బడ్జెట్ మాత్రం కష్టమే అంటున్నారు విశ్లేషకులు. పైగా కరోనా సమయంలో ఇప్పుడు బడ్జెట్ కట్ డౌన్ చేసుకోవాలని నిర్మాతలు అడుగుతున్నారు. 

కానీ ఆ దర్శకుడు మాత్రం దానికి యిష్టపడకపోగా ఇంకా బడ్జెట్ పెంచేయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. అవసరం లేకపోయినా కూడా తన సినిమాలో భారీ స్టార్ క్యాస్టింగ్ కావాలంటున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాని ఫారిన్ లొకేషన్స్ తో పాటు మంచు పర్వతాల్లో కూడా తెరకెక్కించాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఊరు దాటడమే కష్టంరా బాబూ అనుకుంటుంటే ఏకంగా దేశాలు దాటిస్తానంటున్నాడు ఈ దర్శకుడు. ఈయన చెబుతున్న లెక్కలు.. వేస్తున్న అంచనాలు చూసి నిర్మాతకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయని తెలుస్తుంది. అమ్మో ఎందుకురా బాబూ ఈ చిత్రం ఒప్పుకున్నాననంటూ ఆయన వాపోతున్నాడని ప్రచారం జరుగుతుంది. బడ్జెట్ లెక్కలు తగ్గించే ఆలోచనలో ఉండాలని దర్శకులకు కొందరు సూచిస్తుంటే.. ఈయన మాత్రం అలాంటిదేం లేదంటున్నాడు. మొత్తానికి బడ్జెట్ వర్కవుట్ కాకపోతే రేపు సినిమా హిట్ అయినా కూడా లాభం ఉండదు.. మీరు తీసేది బాహుబలి కాదు అది గుర్తు పెట్టుకోండంటూ కొందరు ఈయనకు బాహాటంగానే సెటైర్లు వేస్తున్నారు. 

More Related Stories