నడుముతో మాయ చేస్తున్న పరిణీతి చోప్రా..

ఆహా.. ఏం నడుమురా బాబూ.. ఎక్కడ చేయించిందో కానీ సీతమ్మ వాకిట్లో సినిమాలో మహేష్ బాబు అంటాడు కదా. ఇప్పుడు పరిణీతిని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఆమె నడుము కూడా ఉడుములా అందర్నీ పట్టేసుకుంటుంది. ఒకప్పుడు యశ్ రాజ్ సంస్థలో మేనేజర్ గా పని చేసి అదే సంస్థలో హీరోయిన్ గా మారింది పరిణీతి. బాలీవుడ్ లో అడపా దడపా సినిమాలతో నెట్టుకొస్తున్న పరిణీతి అందాల ఆరబోత విషయంలో మాత్రం అస్సలు ఆగడం లేదు.. దాచడం లేదు. ఇప్పుడు కూడా ఇదే చేసింది. ఒకప్పుడు బండగా, బొద్దుగా ఉండే ఈ బ్యూటీ.. ఇప్పుడు మెరుపుతీగకు చెల్లిగా తయారైంది. కేవలం ఏడాది గ్యాప్ లోనే అస్సలు గుర్తుపట్టలేని విధంగా మేకోవర్ అయిపోయింది పరిణీతి చోప్రా.
యశ్ రాజ్ సంస్థ పిఆర్వో గా కెరీర్ మొదలుపెట్టి.. అదే సంస్థ నిర్మించిన లేడీస్ వర్సెస్ రిక్కీబెల్ తో హీరోయిన్ గా పరిచయమైంది పరిణీతి. మొదట్లో కాస్త బక్కగానే ఉన్న ఈ బ్యూటీ.. శుద్ధ్ దేశీ రొమాన్స్ టైమ్ కు బాగా బొద్దుగా మారిపోయింది. లావుగా ఉండటంతో కొన్ని అవకాశాలు చేజారిపోయాయి కూడా. కానీ పరిణీతి మాత్రం తనకిలా ఉండటమే ఇష్టమంటూ కటింగ్స్ ఇచ్చింది. కానీ అవకాశాలు మరీ నెమ్మదించడంతో.. భామ సన్నబడక తప్పలేదు. కేవలం ఏడాది గ్యాప్ లోనే ఒంట్లో కొవ్వునంత కరిగించేసి.. సన్నగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఒకప్పుడు బొద్దంతాలతో మత్తెక్కించిన పరిణీతి.. ఇప్పుడు మెరుపుతీగ లాంటి పోజులతో చిత్తుచేస్తుంది. స్టార్ హీరోలు కూడా పిలిచి ఆఫర్లు ఇస్తున్నారు. షూటింగ్స్ లో ఖాళీ సమయం దొరికినపుడు ఇలా అందాలన్నీ ఆరబోస్తూ ఫోటోలకు పోజులివ్వడం అలవాటుగా మార్చుకుంది పరిణీతి. తనకు ఫోటోలు తీసుకోవడం సరదా అంటుంది ఈ ముద్దుగుమ్మ. అందుకే హాట్ ఫోటోషూట్స్ వరసగా చేస్తుంది. తాజాగా వర్కవుట్స్ చేస్తూ నడుములో పోస్టులు పెట్టింది పరిణీతి. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.