English   

పబ్‌జీకి అలవాటు పడిపోయిన ఇస్మార్ట్ హీరోయిన్..

 Nidhhi Agerwal
2020-05-16 17:25:01

పబ్‌జీ.. గత ఏడాదిగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. ఈ ఆటకు అలవాటు పడి ప్రాణాలు కూడా పోగొటుకున్న వాళ్లున్నారు. అంతగా పిచ్చిలో మునిగిపోతారు వీళ్లు. ఇక ఇప్పుడు ఈ గేమ్ తాను కూడా ఆడుతున్నట్లు తెలిపింది ఇస్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్. ప్రస్తుతానికి ఎలాగూ సినిమాలు కూడా లేవు.. షూటింగ్స్ ఆగిపోయాయి.. ఇంట్లోనే ఉండిపోవడంతో హాయిగా పబ్ జి ఆడుతున్నట్లు తెలిపింది ఈ బ్యూటీ. ఈ ఆట ఆడటం మొదలు పెడితే టైమ్ తెలియదు.. అదో వ్యసనంగా మారుతుంది. లాక్ డౌన్ లో చాలా మంది ఆడుతున్న గేమ్ కూడా ఇదే. అందుకే తన మొబైల్ లో పబ్ జీ గేమ్ స్క్రీన్ షాట్ తీసి ట్వీట్ చేసింది నిధి. అండ్ ఇట్ బిగిన్స్ అంటూ రాసుకొచ్చింది. అంటే ఆడటం మొదలు పెట్టానని అర్థం. కొందరు పబ్ జీ ప్రేమికులు నిధిని పబ్ జీ ఐడీ ఇవ్వమని.. మీతో ఆడతామని కోరుతున్నారు. అయితే చాలా మంది కూడా ఈ ఆటను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో పబ్ జీ ఆడాలంటూ నిధి ప్రమోట్ చేయడంపై కొందరు మండి పడుతున్నారు. బాధ్యత ఉండక్కర్లా అంటూ ఫైర్ అవుతున్నారు. 

More Related Stories