English   

దేవుడా.. అల వైకుంఠపురములో ఆల్బమ్ మరో రికార్డ్..

 Ala Vaikunthapurramuloo
2020-05-16 18:11:47

అల్లు అర్జున్ కెరీర్ లో ఎన్ని సినిమాలు ఉన్నా కూడా అల వైకుంఠపురములో మాత్రం ప్రత్యేకం. మరీ ముఖ్యంగా ఇందులో పాటలు అయితే సంచలనమే. ఒకప్పుడు పెళ్లి సందడి, జల్సా లాంటి సినిమాల్లోని పాటలు అలా ఉన్నాయంటా.. అంత పెద్ద హిట్ అయ్యాయంటా అని చెప్పుకునేలా ఈ సినిమా పాటలిచ్చాడు తమన్. ఈయన కెరీర్ లోనే అదిరిపోయే ఆల్బమ్ ఇది. అందుకే విడుదలైన క్షణం నుంచి రికార్డులు సృష్టిస్తూనే ఉంది అల వైకుంఠపురములో ఆల్బమ్. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. ఈ సినిమాలోని సామజవరగమన, బుట్టబొమ్మ, రాములో.. రాముల ఇప్పటికే 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక ఇప్పుడు సినిమాలోని అన్ని పాటలకు కూడా మరో రికార్డు చేరువైంది. `అల వైకుంఠపురములో..` మ్యూజిక్ ఆల్బమ్‌కి యూట్యూబ్‌లో మొత్తం బిలియన్ వ్యూస్ వచ్చాయి.. అంటే అక్షరాలా వంద కోట్ల వ్యూస్ అన్నమాట. తెలుగు సినిమా చరిత్రలో ఒక సినిమా ఆల్బమ్‌కి ఈ స్థాయిలో ఆదరణ రావడం ఇదే తొలిసారి. అల వైకుంఠపురములో.. ఆల్బమ్‌కి యూట్యూబ్‌లో బిలియన్ వ్యూస్ వచ్చాయి.. మా ఆల్బమ్‌ను ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు అంటూ గీతా ఆర్ట్స్ సంస్థ ట్వీట్ చేసింది. మొత్తానికి సినిమా విడుదలై ఆర్నెళ్లవుతున్నా కూడా అల వైకుంఠపురములో రికార్డుల హోరు జోరు మాత్రం తగ్గట్లేదు. 
 

More Related Stories