English   

నిశ్శబ్దం ఇక అమేజాన్ లోనే....అందుకే అమ్మేస్తున్నారట !

anushka
2020-05-17 08:11:15

అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ షూట్ అంతా రెడీ అయి రిలీజ్‌కి రెడీగా ఉంది. కరోనా దెబ్బ లేకుండా ఉంటే ‘నిశ్శబ్దం’ సినిమా నెలన్నర క్రితమే థియేటర్స్‌లో సందడి చేసేది. ఈ సినిమాని ఏప్రిల్ 2న విడుదల చేయడానికి అంతా రెడీ కాగా కరోనా దెబ్బకు ఆగింది. నిజానికి గత ఏడాది విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల రీత్యా వాయిదా పడింది. హేమంత్ దర్శకత్వంలో నిశ్శబ్దం తెరకెక్కింది. ఈ సినిమాలో అనుష్క పాత్రను చాలా ఆసక్తిగా మలిచారు. ఈ సినిమాలో మాధవన్ హీరోగా నటించగా.. హీరోయిన్లు అంజలి, శాలిని పాండే కీలక పాత్రల్లో నటించారు. హాలీవుడ్ నటుడు మ్యాడిన్సన్ విలన్‌గా నటించాడు. ఈ సినిమాని కోన ఫిలిం కార్పొరేషన్ అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ల పై టి.జి.విశ్వ ప్రసాద్ మరియు కోన వెంకట్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘బాహుబలి’ తరువాత అనుష్క మార్కెట్ పెరిగింది కాబట్టి తాము కూడా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

అయితే ‘నిశ్శబ్దం’ ను డైరెక్ట్ గా ఆన్లైన్ లో విడుదల చేయబోతున్నట్టు కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారంలో నిజం లేదని ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని యూనిట్ చెబుతూ ఒస్తోంది. అయితే కరోనా ఇప్పట్లో వదలదని దీనితోనే జీవించాలని ప్రభుత్వాలు చెబుతున్న క్రమంలో ఈ సినిమా కోసం చేసిన ఫైనాన్షియర్స్ కి భారీగా ఇంట్రెస్ట్ లు కట్టాల్సి రావడంతో ఈ సినిమాని ఆమెజాన్ కి అమ్మేయాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. దీంతో అనుష్క సినిమా ఆన్ లైన్ లోనే రావచ్చని అంటున్నారు.

 

More Related Stories