English   

సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న రాయ్ లక్ష్మీ

rai
2020-05-17 08:20:27

కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్‌లన్నీ బంద్‌ అయిపోయాయి. ఇండస్ట్రీ మొత్తం ఇంటికే పరిమితమైపోయింది. హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, టెక్నీషియన్లు.. ఇలా అందరు ఇళ్లలో కుటుంబసభ్యులతో హ్యాపీగా గడుపుతున్నారు. ఇంటిపని, వంటపనులతో సందడి చేస్తున్నారు. ఒక పక్క సాయం చేస్తూ మరో పక్క తమ వంతుగా ఎంటర్టైన్ కూడా చేస్తున్నారు. తాజాగా నటి రాయ్ లక్ష్మి కూడా తన డ్యాన్స్ తో తన ఫాలోవర్స్ ని రంజింప చేసే పనిలో పడింది.

తాజాగా ఈ కన్నడ భామ హాలీవుడ్ సాంగ్ హిట్స్ డోంట్ లై అనే సాంగ్‌కి స్టెప్పులు వేసి నెటిజ‌న్స్ దృష్టిలో పడింది. అసలే కరోనా దెబ్బకు ఖాళీగా ఉన్న కుర్రోళ్ళు ఆ డ్యాన్స్ వీడియోను వైరల్ చేసే పనిలో పడ్డారు. ఇక సౌత్ లో పాపుల‌ర్ అయిన ఈ న‌టి తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్నడ భాష‌ల‌లో ఏకంగా 50కి పైగా సినిమాల‌లో న‌టించినా ఆమెకు స్టార్ హోదా అయితే దక్కలేదు. 17 ఏళ్ళ వ‌య‌స్సులో త‌మిళ చిత్రం క‌ర‌క క‌సాద‌రతో వెండితెర ఆరంగేట్రం చేసింది రాయ్ ల‌క్ష్మీ. ఆ త‌ర్వాత అనేక చిత్రాల‌లో లీడ్ రోల్స్ చేసినా ఆమెకి కాలం కలిసి రాలేదు. ఈ అమ్మ‌డు 2017లో జూలీ 2 చిత్రంతో బాలీవుడ్ తెర‌కి ప‌రిచ‌యం అయినా అక్కడా అనుకున్న క్రేజ్ దక్కలేదు.

 

More Related Stories