English   

షారుక్ కూతురు సుహానా కోసం బాలీవుడ్ దర్శకులు క్యూ..

shah
2020-05-17 09:36:22

బాలీవుడ్ లో ఇప్పుడు అంతా న‌యా త‌రం వ‌చ్చేసింది. కొత్త హీరోయిన్లు అంతా వ‌చ్చేస్తున్నారు. ఆ మధ్య శ్రీ‌దేవి కూతురు జాన్వీ కూడా తొలి సినిమా ధ‌డ‌క్ తో అంద‌ర్నీ అల‌రించింది. ఇక సైఫ్ కూతురు సారా అలీ ఖాన్ కూడా సింబా సినిమాతో పరిచయమైంది. ఇప్పుడు షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ వంతు. ఇప్ప‌టికే ఈ భామ‌పై బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌లు ఓ క‌న్నేసి ఉంచారు. ఈ మ‌ధ్యే ఓ పోటోషూట్ లో హాట్ హాట్ గా అందాలు కూడా ఆర‌బోసింది ఈ ముద్దుగుమ్మ‌. లేలేత అందాల‌తో అంద‌ర్నీ ఫిదా చేసింది.

అయితే ఇప్పుడు సుహానా ఎంట్రీ కోసం ద‌ర్శ‌క నిర్మాత‌లు అంతా క్యూలో ఉన్నారు. ముఖ్యంగా వార‌సుల‌ను లాంచ్ చేయ‌డంలో దిట్ట అయిన క‌ర‌ణ్ జోహార్ అయితే సుహానా కోసం క‌థ సిద్ధం చేస్తున్నాడు. సంజ‌య్ లీలా భన్సాలీ.. సుజాయ్ ఘోష్ లాంటి ద‌ర్శ‌కులు కూడా షారుక్ కూతురును బాలీవుడ్ కు ప‌రిచ‌యం చేయాల‌ని ముచ్చ‌ట ప‌డుతున్నారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు షారుక్ మ‌న‌సులో ఏముందో మాత్రం బ‌య‌టికి రావ‌డం లేదు. ఇప్ప‌ట్లో ఈయ‌న చెప్పేలా కూడా క‌నిపించ‌డం లేదు. త‌న‌కు న‌చ్చిన వాళ్ల‌కే కూతురు లాంఛింగ్ కార్య‌క్ర‌మం అప్ప‌చెప్పేలా ఉన్నాడు కింగ్ ఖాన్. మ‌రోవైపు కొడుకు ఆర్య‌న్ కూడా త్వ‌ర‌లోనే బాలీవుడ్ కు వ‌స్తాడ‌ని తెలుస్తుంది. మ‌రి చూడాలిక‌.. షారుక్ త‌ర్వాతి త‌రాన్ని బాలీవుడ్ కు ఎవ‌రు ప‌రిచ‌యం చేయ‌బోతున్నారో..? ఆ అవ‌కాశం ఎవ‌రికి ల‌భించ‌నుందో..?

More Related Stories