English   

థియేటర్లలో మందు..సురేష్ బాబు ఐడియా విన్నారా ?

sureshbabu
2020-05-17 10:24:36

కరోనా క్రైసిస్ తో సినిమా ఇండస్ట్రీ మీద కోలుకోలేని దెబ్బపడినట్టే కనిపిస్తోంది. రెండు వారాలు అనుకున్న లాక్ డౌన్ ఇప్పుడు  మరో ఇరువై రోజులకు పెరిగింది. దీంతో ఆడియన్స్ తో అనునిత్యం కళకళలాడే థియేటర్స్ నిర్మానూహ్యంగా మారిపోయాయి. ప్రేక్షకుల కిటకిటలతో సందడిగా ఉండే సినిమా హాళ్ళు, మాల్స్ వెలవెలబోతున్నాయి. కరోనా ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో... ఎప్పుడు పరిస్థితి నార్మల్‌ స్టేజ్‌కు వస్తుందో తెలీని పరిస్థితి. వచ్చిన తర్వాత ఏం చేయాలన్న ప్లాన్‌లో సినిమా ఇండస్ట్రీ వుంది. కరోనాతో భయపడిపోయిన జనాలను మళ్లీ థియేటర్స్‌కు రప్పించడం ఎలా? సినిమాలను ఏ పద్ధతిలో రిలీజ్‌ చేయాలి. టిక్కెట్‌ రేట్లు తగ్గించాలా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఇండియన్‌ సినీ ఇండస్ట్రీ ముందు ఉన్నాయి.

ఒక వేళ లాక్ డౌన్ ఎత్తేసినా జనాన్ని ఇప్పట్లో గుంపులుగా అనుమతించే పరిస్థితి లేదు కనుక జూన్ లేదా జులైకి థియేటర్స్ మళ్ళీ రెడీ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు ! అది కూడా అనుమానమే. అయితే సీనియర్ నిర్మాత సురేష్ బాబు ఈ ఏడాది చివరి వరకు థియేటర్లు తెరుచుకోక పోవచ్చేమోనని అప్పట్లో బాంబ్ వేయగా ఇప్పుడు ఆయనకు సంబందించిన మరో ఆసక్తికర విషయాన్ని నాగ్ అశ్విన్ బయట పెట్టారు. అదేంటంటే విదేశీ తరహాలో ఇకపై మన థియేటర్లలో బీర్ లు.. బ్రీజర్లు అమ్మితే ఎలా ఉంటుందనే యోచన చేశాడట ఆయన. ఈ విషయాన్ని తన కొడుకు రానాతో పంచుకుంటుంటే రాణాకు స్నేహితుడు అయిన దర్శకుడు నాగ్ అశ్విన్ విన్నారట. ఈ విషయాన్నే బయట పెట్టిన అయన ఈ ఐడియా ఎలా ఉంది? మీ అభిప్రాయం చెప్పండి.. అంటూ నెటిజనుల అభిప్రాయం కోరారు.  అయితే థియేటర్లలో మద్యం అమ్మకాలతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కోల్పోయే ప్రమాదం సైతం ఉంది కదా అని ఒక నెటిజన్ అడగగా అన్ని థియేటర్లలో కాకుండా కొన్ని మల్టీప్లెక్స్ హాల్స్‌లో అనుమతి ఇస్తేనైనా జనాలను లాక్‌డౌన్ తర్వాత థియేటర్లకు తీసుకురావచ్చునని అశ్విన్ రిప్లై ట్వీట్ చేశాడు. 

More Related Stories