English   

టాలీవుడ్ కి షాకిచ్చిన తలసాని..థియేటర్స్ రీ ఓపెనింగ్‌ కి ఇంకా నాలుగు నెలలు ?

talasani
2020-05-17 10:30:29

కరోనా క్రైసిస్ తో సినిమా ఇండస్ట్రీ మీద కోలుకోలేని దెబ్బపడినట్టే కనిపిస్తోంది. రెండు వారాలు అనుకున్న లాక్ డౌన్ ఇప్పుడు రెండు నెలలు అయింది. ఇంకా ఎప్పటి దాకా ఉంటుందో తెలియదు.  దీంతో ఆడియన్స్ తో అనునిత్యం కళకళలాడే థియేటర్స్ నిర్మానూహ్యంగా మారిపోయాయి. ప్రేక్షకుల కిటకిటలతో సందడిగా ఉండే సినిమా హాళ్ళు, మాల్స్ వెలవెలబోతున్నాయి. కరోనా ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో... ఎప్పుడు పరిస్థితి నార్మల్‌ స్టేజ్‌కు వస్తుందో తెలీని పరిస్థితి. వచ్చిన తర్వాత ఏం చేయాలన్న ప్లాన్‌లో సినిమా ఇండస్ట్రీ వుంది. కరోనాతో భయపడిపోయిన జనాలను మళ్లీ థియేటర్స్‌కు రప్పించడం ఎలా? సినిమాలను ఏ పద్ధతిలో రిలీజ్‌ చేయాలి. టిక్కెట్‌ రేట్లు తగ్గించాలా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఇండియన్‌ సినీ ఇండస్ట్రీ ముందు ఉన్నాయి.

కరోన తగ్గు ముఖం పట్టి ఒక వేళ  లాక్ డౌన్ మే నెలలో ఎత్తేసినా జనాన్ని ఇప్పట్లో గుంపులుగా అనుమతించే పరిస్థితి లేదు కనుక జూన్ లేదా జులైకి థియేటర్స్ మళ్ళీ రెడీ అయ్యే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే ఈ క్రమంలో తెలంగాణా  సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన కామెంట్స్ తెలుగు చిత్రసీమకు షాకిచ్చాయనే చెపాలి. ఎందుకంటే కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పట్లో థియేటర్స్ రీ ఓపెన్ చేసే అవకాశమే లేదని మూడు-నాలుగు నెలల పాటు థియేటర్స్ రీ ఓపెన్ చేసే ఛాన్స్ లేదని చెప్పారు. అంతేకాక సినిమా షూటింగ్స్ విషయం లోనూ ఎలాంటి సాయం చేయలేమని, కరోనా మహమ్మారి నివారణలో భాగంగా మరికొన్ని రోజుల పాటు షూటింగ్స్‌కి అనుమతి ఇవ్వలేమని ఆయన తేల్చేశారు. దీంతో చిత్రసీమకు షాక్ తగిలినట్లయింది.

 

More Related Stories