English   

ఆన్ లైన్‌లో డ్రెస్ వేలం వేసిన నిత్య...ఆ డబ్బుతో కరోనా ఫండ్

nithya
2020-05-17 10:36:12

తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని నటి నిత్యామీనన్‌. అప్పట్లో వరుస సినిమాలతో దూసుకెళ్లిన ఈ మలయాళీ భామ జోరు తగ్గించింది. అందివచ్చిన అడపాదడపా అవకాశాలతో కెరీర్ సాగిస్తూ మంచి ఆఫర్స్ వస్తేనే అంగీకరిస్తూ వెళ్తోంది. ఇక కరోనా వలన ఏర్పడిన లాక్‌ డౌన్‌ తో కష్టాలు పడుతున్న పేద కుటుంబాల కోసం సినీ సెలబ్రిటీలు అందరూ తమకు తోచిన సాయం చేస్తున్నారు. పలువురు హీరో హీరోయిన్లు ఇప్పటికే విరాళాలు ప్రకటించారు. తాజాగా నిత్య కూడా తన వంతుగా సాయం చేసేందుకు ముందుకు వచ్చింది.

పేదల కోసం నిత్యా మీనన్‌ తన డ్రస్‌ ను ఒకదానిని వేలం వేస్తున్నట్టు ప్రకటించారు. లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో తాను ధరించిన డ్రస్‌ను వేలం వేస్తున్నానన్న ఆమె దీని ద్వారా వచ్చిన డబ్బులను అర్పణం ట్రస్ట్‌కి ఇస్తానని పేర్కొన్నారు. ఈ ట్రస్ట్‌ గ్రామాల్లో పేద ప్రజలకు తమ కాళ్ల మీద తాము నిలబడానికి అవసరమైన సహకారాన్ని, ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని నిత్య పేర్కొన్నారు. ఇక నిన్న సాయంత్రం 4 గంటలకు వేలం ప్రారంభమయుంది. వేలం పాటకు సంబంధించిన వివరాల్ని ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో నిత్య పోస్టు చేసింది. @indiawasted అనే ఒక అకౌంట్ లో ఈ ఆక్షన్ జరగనుంది. ఈ వేలం యొక్క బిడ్డింగ్ ఈరోజు నాలుగింటికి మొదలు కానుంది. ఇక ఈ బిడ్డింగ్ మే 20 రాత్రి తొమ్మిదింటికి ముగియనుంది. అంటే ఈ డ్రెస్ ఎంత వేలానికి అమ్ముడు పోయిందనే విషయం 20వ తేదీన తేలనుంది.

 

More Related Stories