English   

మహేష్ ఏంటి రోజురోజుకీ ఇంత యంగ్ అయిపోతున్నాడు..?

mahesh
2020-05-17 16:12:19

ఇప్పుడందరికీ ఇదే అనుమానం వస్తుంది. మహేష్ బాబు వయసు 46.. కానీ ఈయన్ని చూస్తుంటే 20ల్లోనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఇప్పటికీ అదే లుక్ మెయింటేన్ చేస్తున్నాడు సూపర్ స్టార్. తాజాగా లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉన్న మహేష్ బాబు.. తన పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. ఆ ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలోకి వస్తున్నాయి. వాటిని చూసి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా షాక్ అవుతున్నారు. ఇంతకీ ఏం తింటున్నాడు ఈయన.. లేదంటే దేవుడు ఈయనొక్కడికే వయసు దాచుకునే యంత్రమేమైనా ఇచ్చాడా ఏంటి అన్నట్లుగా ఉన్నాడు సూపర్ స్టార్. అసలు వయసు కనిపించక పోగా.. ఇంకా రోజురోజుకీ యంగ్ అయిపోతున్నాడు మహేష్ బాబు. తాజాగా గౌతమ్, సితారతో ఉన్న పోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు సూపర్ స్టార్.

అందులో మహేష్, గౌతమ్ ను పక్కపక్కనే చూస్తుంటే అన్నాదమ్ముల్లా అనిపిస్తున్నారు కానీ తండ్రీ కొడుకుల్లా మాత్రం కాదు. తన క్వారంటైన్ టైమ్ అంతా కుటుంబానికే ఇచ్చేస్తున్నాడు ఈయన. మరీ ముఖ్యంగా కూతురు సితారతోనే తన ఆటపాటలన్నీ సాగిస్తున్నాడు సూపర్ స్టార్. హాయిగా ఈ హాలీడేస్ ను ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్ బాబు. మరో రెండు నెలల వరకు కుటుంబంతోనే ఉండనున్నాడు ఈయన. ఎలాగూ షూటింగ్స్ లేవు కాబట్టి కుటుంబమే ప్రాణం అంటున్నాడు. ఎప్పటికప్పుడు సితారతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు మహేష్ బాబు. ఇక ఇప్పుడు ఈయన చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. అసలు మహేష్ గ్లామర్ సీక్రేట్ ఏంటో తెలుసుకోవాలని చాలా మంది చూస్తున్నారు. దీనికి తన కుటుంబమే బలమని ఎప్పుడు అడిగినా చెప్తాడు మహేష్. వాళ్లు లేకపోతే తాను లేనంటాడు. అందులోనే అందం కూడా అంటున్నాడు సూపర్ స్టార్.

More Related Stories