English   

ప్రియా ప్రకాశ్ సంచలన నిర్ణయం.. ఫ్యాన్స్ షాక్..

priya
2020-05-17 16:28:55

ఒరు ఆదార్ లవ్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్. మలయాళ కుట్టి అయినా కూడా ఒక్క కన్నుగొట్టి ప్రపంచాన్ని పడగొట్టింది ఈ భామ. అప్పట్లో ఈ ముద్దుగుమ్మకు సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. తొలి సినిమా విడుదల కాకముందే చాలా క్రేజీ ఆఫర్స్ కూడా వచ్చాయి. అయితే ఒరు ఆదార్ లవ్ విడుదల కావడం.. అది డిజాస్టర్ కావడంతో కనీసం ఈ భామ వైపు ఎవరూ చూడట్లేదు. అయితే ఈ సినిమాకు ముందు కన్ను గొట్టిన తీరుతో సోషల్ మీడియాలో స్టార్ అయిపోయింది ప్రియ.

ఈమెకు ఇన్‌స్టాలో 7.2 మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు. స్టార్స్ కు కూడా ఇంత ఫాలోయింగ్ లేదంటే అతిశయోక్తి కాదేమో..? అయితే ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ ఉన్నట్లుండి ప్రియా ప్రకాశ్ తన అభిమానులకి పెద్ద షాక్ ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ నుండి తప్పుకుంది ఈ భామ. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనేది మాత్రం అర్థం కావడం లేదు కానీ ఏకంగా 72 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్న అకౌంట్ మూసేయడం మాత్రం సంచలనమే. ట్రోల్ చేస్తున్నారనే కారణంతోనే ప్రియా ఇన్‌స్టాగ్రామ్ నుండి తప్పుకుందని తెలుస్తుంది. ప్రియా ప్రకాశ్ తెలుగులో నితిన్ సరసన చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తుంది. ఇందులో రకుల్ మెయిన్ హీరోయిన్.

More Related Stories