English   

బాయ్ ఫ్రెండ్ డైరెక్షన్ లో పాయల్ షార్ట్ ఫిల్మ్

payal
2020-05-17 16:39:27

ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ ఈ కరోన టైమ్ లో ఒక షార్ట్ ఫిలిమ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా వల్ల లాక్డౌన్ విధించడంతో ఎంతో మంది మొగుళ్ళు తమ భార్యల్ని గృహహింసకి గురిచేస్తున్నారని వార్తలు వస్తున్న క్రమంలో అదే అంశాన్ని ఎంచుకుని షార్ట్ ఫిలిం చేసింది ఈ భామ.  24 గంటల వ్యవధిలో తెరకెక్కించిన ఈ షార్ట్ ఫిలిమ్ లో భర్త హింసించే దాని వల్ల భార్య ఎన్ని ఇబ్బందులు పడుతుందో చూపించారు. ఈ లఘుచిత్రంలో పాయల్ రాజ్ పుత్ గృహిణిగా ఉంటూనే రైటర్ గా పని చేస్తుంది. అయితే తన భర్త హింస వల్ల ఆమె ఏమీ రాయలేకపోతుంది. ప్రతీ సారీ ఏదో ఒక విషయమై ఇబ్బంది ఎదురవుతూనే ఉంటుంది. భర్త హింస రోజు రోజుకీ పెరిగిపోవడంతో ఒకానొక రోజు అతన్ని చంపేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే స్టోరీ. ఈ షార్ట్ ఫిల్మ్ ని పాయల్ బాయ్ ఫ్రెండ్ సౌరభ్ ధింగ్రా దర్శకత్వం వహించాడు. 16 నిమిషాల నిడివగల ఈ షార్ట్ ఫిలిమ్ ద్వారా పాయల్ మంచి ప్రయత్నం చేసిందని చెప్పవచ్చు. ఆర్‌ఎక్స్ 100 త‌ర‌వాత పాయ‌ల్‌కి అవ‌కాశాలొచ్చినా ఒక్క హిట్టు కూడా కొట్ట‌లేదు. వెంకీ మామ‌ సినిమా హిట్టయినా అందులో ఈ భాగం ఏమీ లేదు.

 

More Related Stories