English   

ప్రభాస్ కి విలన్ గా రానా..ఆ క్రేజీ ప్రాజెక్ట్ లోనే !

prabhas
2020-05-18 13:46:12

 ప్రస్తుతం జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన ఈ సినిమా తరువాత మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించబోతున్నారు. సై ఫై కధతో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాను అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నాడు. దాదాపు 400కోట్లతో పాన్ వరల్డ్ మూవీగా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమాలో నటించే ప్రతి ఒక్కరు స్టార్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం ఒకప్పటి స్టార్ హీరోను నటింపచేయాలని చూస్తున్నట్టు చెబుతున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ రోల్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. అదీ కాక సరికొత్త విలనిజం పండించడానికి నాగ్ అశ్విన్ ప్లాన్ చేశారని అంటున్నారు.

ఆ పాత్రకు అరవింద్‌ స్వామి అయితే బావుంటుందనే ఆలోచనలో సినిమా యూనిట్ ఉందని ప్రచారం జరిగింది. అయితే ఆ విశాయం మీద క్లారిటీ రాకున్నా ఇప్పుడు కొత్త పుకారు మొదలైంది. అదేంటంటే ఈ సినిమాలో విలన్ గా రానా నటిస్తున్నాడట. అయితే ఈ పుకారు రేగడానికి కారణం సోషల్ మీడియానే. తాజాగా రానా సొషల్ మీడియాలో వర్క్ చేస్తున్న ఫోటో షేర్ చేశాడు. ఆ ఫోటోని నాగ్ అశ్విన్ తీశాడని క్రెడిట్ ఇచ్చారు. దాంతో ఒక్కసారిగా ఈ పుకార్లు చెలరేగాయి. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమంటే రానాకి నాగ్ మంచి ఫ్రెండ్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానా మొదటి సినిమా లీడర్ తెరకెక్కగా ఆ సిన్మాకి అశ్విన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఆ సమయంలోనే వీరిద్దరికీ మంచి బాండింగ్ ఏర్పడింది. అలా వీరిద్దరూ క్లోజ్ అనే చెప్పాలి. మరి ఈ సినిమా విషయంలో ఎంతవరకూ ఈ పుకారు నిజం అవుతుందో చూడాలి. 

More Related Stories