English   

ప్రభాస్ కి విలన్ గా రానా...నాగ్ అశ్విన్ ఏమన్నారంటే 

Rana
2020-05-18 09:32:23

ప్రస్తుతం జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన ఈ సినిమా తరువాత మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించబోతున్నారు. సై ఫై కధతో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాను అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నాడు. దాదాపు 400కోట్లతో పాన్ వరల్డ్ మూవీగా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమాలో నటించే ప్రతి ఒక్కరు స్టార్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం ఒకప్పటి స్టార్ హీరోను నటింపచేయాలని చూస్తున్నట్టు చెబుతున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ రోల్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. అదీ కాక సరికొత్త విలనిజం పండించడానికి నాగ్ అశ్విన్ ప్లాన్ చేశారని అంటున్నారు. 

ఆ పాత్రకు అరవింద్‌ స్వామి అయితే బావుంటుందనే ఆలోచనలో సినిమా యూనిట్ ఉందని ప్రచారం జరిగింది. అయితే ఆ విశాయం మీద క్లారిటీ రాకున్నా తాజాగా ఆ పాత్రలో విలన్ గా రానా నటిస్తున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయం మీద నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు. నిన్న ఒక నెటిజన్, అన్నా స్క్రిప్ట్ కి అందరూ ఫిక్స్ అయిపోయారా ? ప్లీస్ దాని గురించి చెప్పండని ట్విట్టర్ లో అడిగారు. దీనికి స్పందించిన అశ్విన్ ప్రస్తుతం స్క్రిప్ట్ అలాగే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, అయితే కరోనా కారణంగా కొన్ని పనులు లేట్ అయ్యాయని చెప్పారు. అయితే ఆ కారణంగా స్క్రిప్ట్ కి టైం దొరకినందుకు హ్యాపీ అన్న ఆయన ఈ సినిమాలోని కీలక పాత్రల కోసం ఎవర్ని తీసుకోవాలో అని కొన్ని ఐడియాలు ఉన్నాయని అన్నారు. అయితే ఈ సినిమా కోసం ఎవరినీ ఫైనల్ చెయ్యలేదని అన్నారు. దానికి ఇంకా టైం పడుతుందని నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు.

More Related Stories