మళ్ళీ రిటైర్మెంట్ ఆలోచన చేస్తున్న కీరవాణి

తెలుగు సినీ పరిశ్రమకు మేటి సంగీత దర్శకుల్లో కీరవాణి ఒకరు. ప్రస్తుతం వచ్చిన యువ సంగీత దర్శకులకు సైతం పోటీగా నిలుస్తూ ఇంకా చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూనే వస్తున్నాడు. ‘బాహుబలి 2’ సమయంలో తాను రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్లుగా ఓసారి రిటైర్మెంట్ గురించి సీరియస్ గా ట్వీట్ చేశాడు కీరవాణి. ఫలానా సంవత్సరం నుంచి నేను సినిమాలు మానేస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు. అప్పుడు ఆ సమయంలో కొంతమంది నిర్మాతలపై మరియు దర్శకులపై కీరవాణి సంచలన ఆరోపణలు చేశారు. మ్యూజిక్ టేస్ట్ లేని వారు కొందరు తన ట్యూన్స్ ను వద్దన్నారంటూ ఆరోపణలు చేసి చర్చనీయాంశం అయ్యాడు. దీంతో బాహుబలి బిగినింగ్ తరవాత కీరవాణి సినిమాలకు దూరం అయిపోతాడనుకున్నారు.
కానీ `బాహుబలి 2` తరవాత ఆయన ప్రయాణం కొనసాగింది. ప్రస్తుతానికి ఆయన జక్కన్న దర్శకత్వంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. అయితే కీరవాణి మరోసారి రిటైర్ మెంట్ ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. యువ సంగీత దర్శకులను ప్రోత్సహించాలనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. కీరవాణి తనయుడు సింగర్ కా లభైరవ సక్సెస్ ఫుల్ “మత్తు వదలరా” మూవీ తో సంగీత దర్శకుడిగా మారారు. దీంతో ఇక తాను రిటైర్ కావచ్చని ఆయన భావిస్తున్నట్టు చేబుహ్తున్నారు.