English   

ఎన్టీఆర్ చేయనన్న కథతో పవన్ సినిమా

Jr NTR
2020-05-18 12:30:12

గబ్బర్ సింగ్ తర్వాత మరోసారి పవన్.. హరీష్ శంకర్‌తో కలిసి పనిచేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. గతంలో పవన్, హరీష్ కాంబినేషన్‌లో ‘గబ్బర్ సింగ్’ సినిమా వచ్చి భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ‘పింక్’ తెలుగు రీమేక్‌ వకీల్ సాబ్ తో బిజీగా ఉన్నారు పవన్. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్‌ కూడా పూర్తి చేసేశారు. పింక్ రీమేక్ లో లాయర్ గా, క్రిష్ సినిమాలో దొంగగా నటిస్తున్న పవన్ కళ్యాణ్ ని మాస్ మిర్చి డైరెక్టర్ అయిన హరీష్ శంకర్ ఎంత ఘాటుగా, నాటుగా ప్రెజెంట్ చేస్తాడా అని అప్పుడే చాలా అంచనాలు పెట్టేసుకున్నారు ఫ్యాన్స్. ఎప్పుడో తేరి రీమేక్ కోసం పవన్ కి ఇచ్చిన అడ్వాన్స్ మైత్రి వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ సెట్ చేసింది. హరీష్ పవన్ ఫ్యాన్ కావడంతో సినిమా రికార్డుల మోత మోగడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.

వాస్తవానికి చిరు కోసం హరీష్‌ శంకర్‌ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర అంశం బయట కొచ్చింది. అదేంటంటే ఒకప్పుడు ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కధే అని అంటున్నారు. గతంలో హరీష్ ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్యా సినిమా చేసిన విషయం తెల్సిందే. ఈ కథ కంటే ముందు హరీష్, ఎన్టీఆర్ కు ఒక కథ చెప్పగా అది నచ్చలేదట. అయితే దాని బదులు రామయ్య వస్తావయ్యా చేసారు. ఇప్పుడు ఆ రిజక్ట్ చేసిన కథకు మార్పులు చేర్పులు చేసి పవన్ కు వినిపించగా అది పవన్ కు తెగ నచ్చేసింది. దానినే ఇప్పుడు తెరకెక్కిస్తున్నారని అంటున్నారు.  

More Related Stories