English   

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. కొంపముంచిన లాక్‌డౌన్..

NTR RRR
2020-05-18 13:24:10

అనుకున్నంతా అయింది.. చాలా రోజులుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేచి చూస్తున్న క్లారిటీ అయితే వచ్చింది కానీ వాళ్లు ఊహించింది మాత్రం కాదు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా టీజర్ వస్తుందని చాలా ఆశతో ఉన్న వాళ్లకు లేదని నిరుత్సాహపరిచే న్యూస్ చెప్పాడు రాజమౌళి. మరో 2 రోజుల్లో వాళ్లు వేచి చూస్తున్న రోజు రానే వస్తుంది. కానీ టీజర్ మాత్రం రావడం లేదు. ఇదే విషయంపై వివరణ కూడా ఇచ్చాడు జక్కన్న. తాము టీజర్ సిద్ధం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫైనల్ వర్క్ మాత్రం పూర్తి చేయలేకపోయామంటూ ట్వీట్ చేసాడు ఈయన. దానికి సంబంధించిన వివరణ ఇస్తూ ఆర్ఆర్ఆర్ టీం ఓ లెటర్ విడుదల చేసింది. ఇది చూసి అంతా అయ్యో అనుకుంటున్నారు. మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా RRR స్పెషల్ టీజర్ విడుదల కాదనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. రాజమౌళి కూడా దీనిపై ముందు నుంచి అభిమానులను సిద్ధం చేసాడు. వర్క్ పూర్తి కాలేదని నెల రోజుల కిందే చెప్పాడు. చేసిన వర్క్ అంతా ఆఫీసుల్లో ఉండిపోయాయి.. మేం లాక్‌డౌన్‌లో లాక్ అయిపోయాం అని చెప్పుకొచ్చాడు రాజమౌళి. ఇప్పుడు ఇదే జరిగింది. టీజర్ అనుకున్న సమయానికి రెడీ అవుతుందో లేదో అనే అనుమానాలే చివరికి నిజమయ్యాయి.. సిద్ధం కాలేదు. టీజర్ లో మాత్రం తెలంగాణ యాసలో కొమురం భీంగా జూనియర్ చెప్పిన డైలాగులు రచ్చ లేపుతాయని ప్రచారం జరుగుతుంది. చరణ్ టీజర్ కంటే మరింత పవర్ ఫుల్ గా ఉండే టీజర్ రెడీ అవుతుందని ప్రచారం జరుగుతున్నా కూడా రాకపోవడంతో నిరాశలో మునిగిపోయారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. 
 

More Related Stories