English   

టెర్రరిస్ట్‌గా మారుతున్న సమంత అక్కినేని..

Samantha
2020-05-18 15:25:32

సమంత అక్కినేని టెర్రరిస్ట్ కావడం ఏంటి అనుకుంటున్నారా..? అంత అవసరం ఏమొచ్చింది అనుకుంటున్నారా. కథ డిమాండ్ చేస్తే తాను ప్రయోగాత్మక పాత్రలు చేయడానికి ఎప్పుడూ సిద్ధమే అని చెబుతోంది అక్కినేని కోడలు. దీనికి తగ్గట్లుగానే ఇప్పుడు స్యామ్ దగ్గరికి ఒక చాలెంజింగ్ స్టోరీ వచ్చింది. అయితే అది సినిమా కాదు.. ఓ వెబ్ సిరీస్. ఇప్పుడు హీరోయిన్ల మొత్తం కూడా వెబ్ సిరీస్ లతో బిజీగా మారిపోతున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోయిన్లు వెబ్ సిరీస్ ల గురించి ఆలోచిస్తున్నారు.. అటువైపుగా అడుగు వేస్తున్నారు. కాజల్ అగర్వాల్ కూడా తమిళనాట లైవ్ టెలికాస్ట్ అనే ఒక వెబ్ సిరీస్ చేస్తుంది. ఇప్పుడు సమంత దగ్గరికి కూడా ఒక కథ వచ్చేసరికి ఆమె ఓకే చెప్పేసింది. అందులో ఆమె ప్రతినాయిక పాత్ర పోషించాల్సి వచ్చినా కూడా కథ నచ్చడంతో ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా నటించడానికి ఓకే చెప్పేసింది అక్కినేని కోడలు. నటించింది కూడా. మనోజ్ బాజ్ పెయి, ప్రియమణి, సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్. 

ఇప్పుడు ఈ దీనికి రెండో సీజన్ కూడా పూర్తి చేసారు దర్శక నిర్మాతలు. అందులో సమంత నెగిటివ్ క్యారెక్టర్ చేసింది. అభిమానులకు ఇది కొత్తగా కనిపిస్తున్న కూడా ఇదే నిజం. ఫ్యామిలీ మెన్ 2 త్వరలోనే అమెజాన్ లో విడుదల కానుంది. గతంలో విక్రమ్ హీరోగా నటించిన పత్తు ఎంద్రాకుల్లా సినిమాలో విలన్ గా నటించింది సమంత. అయితే అందులో ద్విపాత్రాభినయం చేసింది ఈ భామ. ఒకటి మంచి ఇంకొకటి చెడు. కానీ ఇప్పుడు మాత్రం ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ లో పూర్తిస్థాయి నెగిటివ్ పాత్ర చేస్తుంది సమంత అక్కినేని. అందులోనూ అది టెర్రరిస్ట్ పాత్ర అని ప్రచారం జరుగుతుంది. మరి దీనికి అభిమానుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
 

More Related Stories