English   

ప్రభాస్‌తో నటించడం అద్భుతం.. భాగ్యశ్రీ 

Bhagyashree
2020-05-18 16:34:46

ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలు చేస్తున్నాడు. సాహో తర్వాత మరో సినిమా కోసం టైమ్ తీసుకుంటున్నా కూడా దర్శకులను మాత్రం లైన్ లో పెట్టేసాడు. ప్రస్తుతం ఈయన రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో జాన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఇప్పటికే షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయింది. ఈ సినిమాను కూడా ఇండియన్ వైడ్ గా విడుదల చేస్తున్నారు. పాన్ ఇండియన్ సబ్జెక్ట్ ఇది అంటున్నాడు దర్శకుడు రాధాకృష్ణ కుమార్ కూడా. జిల్ తర్వాత ఏ సినిమా చేయని ఆయన ప్రభాస్ కోసమే ఈ కథ సిద్ధం చేసాడు. ఖర్చుకు వెనకాడకుండా విదేశాల్లోనే ఎక్కువ భాగం షూటింగ్ చేస్తున్నాడు దర్శకుడు. 

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ `మైనే ప్యార్ కియా` ఫేమ్ భాగ్యశ్రీ నటిస్తుంది. ప్రభాస్ తల్లిగా ఈమె నటించబోతుంది. దీనిపై కొన్ని రోజులుగా గాసిప్స్ వచ్చినా కూడా ఇప్పుడు స్వయంగా భాగ్యశ్రీ కన్ఫర్మ్ చేసింది. తాను ప్రభాస్ సినిమా చేస్తున్నానని చెప్పుకొచ్చింది ఈ సీనియర్ హీరోయిన్. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈమె.. ఒకేసారి రెండు భిన్నమైన సినిమాలు ఒప్పుకున్నట్లు తెలిపింది. అందులో ప్రభాస్ సినిమా కూడా ఒకటి అంటుంది ఈమె. ప్రభాస్‌తో నటించడం అద్భుతంగా ఉందని.. స్క్రీన్ స్పేస్ చాలా బాగుంటుందని చెప్పుకొచ్చింది భాగ్యశ్రీ. ఈ సినిమాతో కచ్చితంగా తెలుగులో పాపులర్ అవుతానని చెబుతుంది ఈ సీనియర్ బ్యూటీ. 

More Related Stories