English   

నందమూరి అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ విన్నపం..

Jr NTR
2020-05-18 17:33:59

జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ట్రిపుల్ ఆర్ టీజర్ వస్తుందని చాలా ఆశతో ఉన్న అభిమానులకు నిరాశనే మిగిల్చాడు దర్శకుడు రాజమౌళి. ఇదిలా ఉంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా అభిమానుల కోసం ఓ లెటర్ రాసాడు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టీజర్ కోసం ఎంతగానో వేచి చూసిన అభిమానులను నిరాశ పరిచినందుకు క్షమాపణలు కూడా చెప్పాడు జూనియర్. ప్రియమైన అభిమాన సోదరులకు విన్నపం.. ఈ విపత్తు సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను.. అందరం కలిసి పోరాడితే ఈ కష్టం నుంచి బయటపడతాం అని నమ్ముతున్నాను.. ప్రతీ ఏటా నా పుట్టిన రోజుకు మీరు చూపించే ప్రేమ, చేసే కార్యక్రమాలు ఓ ఆశీర్వచనంగా భావిస్తాను. ఈ ఏడాది మాత్రం మీరు ఇంటి పట్టునే ఉంటూ అధికారులు సూచనలను పాటిస్తూ.. భౌతిక దూరానికి కట్టుబడి ఉంటారని నా విన్నపం.

ఇదే మీరు నాకు ఇచ్చే విలువైన బహుమతి. అలాగే ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి ఈ సందర్భంగా ఎలాంటి టీజర్ కానీ.. ఫస్ట్ లుక్ కానీ విడుదల కావట్లేదనే విషయం మిమ్మల్ని చాలా నిరాశకు గురిం చేసిందని అర్థం చేసుకోగలను. ఫస్ట్ లుక్ లేదా టీజర్ సిద్ధం చేయాలని చిత్రబృందం ఎంతగా కష్టపడిందనే విషయం నాకు తెలుసు. కానీ ఓ ప్రచార చిత్రం మీ ముందుకు రావాలంటే అన్ని సాంకేతిక విభాగాలు కలిసి శ్రమించాలి. అధికారుల ఆంక్షల వల్ల అది కుదర్లేదు. రాజమౌళి గారి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం సంచలన విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుంది. ఈ చిత్రం మిమ్మల్ని తప్పక అలరిస్తుంది. నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తూ.. మీ జూనియర్ ఎన్టీఆర్ అంటూ లేఖను ముగించాడు నందమూరి చిన్నోడు. ప్రస్తుతం ఈ లెటర్ బాగానే వైరల్ అవుతుంది. 

More Related Stories