సూర్య తెగింపు...ప్రసంసించిన పార్తిబన్

నటుడు సూర్యకి తమిళనాడు థియేటర్స్ యజమానుల సంఘానికి మధ్య కాస్త రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఆయనకు దాదాపు 30 మంది తమిళ నిర్మాతలు మద్దతుగా నిలిచారు. నిజానికి 2డీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద జ్యోతిక హీరోయిన్ గా సూర్య నిర్మించిన చిత్రం 'పోన్ మగల్ వందల్'. అయితే లాక్డౌన్ నేపథ్యంలో ఈ సినిమాను నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయనున్నామని ప్రకటించారు. ఈ ప్రకటనతో తమిళ్ ఇండస్ట్రీలో వివాదం మొదలైంది. సూర్యను భయపెట్టేందుకు సూర్య నిర్మించే సినిమాల్ని ఇక తమ థియేటర్ ప్రదర్శించమని, నిషేధిస్తున్నామని యజమానులు ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో తమిళ పరిశ్రమకు చెందిన 30 మంది ప్రముఖ నిర్మాతలు సూర్యకు అండగా నిలిచారు.
పరిస్థితుల్ని బట్టి చిన్న సినిమాల్ని ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో విడుదల చేయడం సరైన నిర్ణయమేనని వారు సూర్య నిర్ణయాన్ని వెనకేసుకొచ్చారు. ఈ ట్రెండ్ వల్ల చిన్న సినిమాల నిర్మాతకు ఆ పెట్టుబడి వెంటనే తిరిగి వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏదయినా కానీ వెనక్కు తగ్గకుండా సూర్య ఈ సినిమాని ఈ నెల 29వ తేదిన అమెజాన్ ప్రైమ్ టైమ్‌లో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఆ సినిమాలో నటించిన దర్శకనిర్మాత పార్తీబన్, సూర్యను ప్రశంసిస్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ధైర్యం పురుష లక్షణమన్న ఆయన భర్త తన సహధర్మచారిణి ప్రేమను, ఆమె గౌరవాన్ని కాపాడటానికి వేసిన అడుగును వెనక్కు తీసుకోలేదని అలా, తన వీరత్వాన్ని ప్రదర్శిస్తూ పొన్మగళ్ వందాల్ చిత్రాన్ని ఓటీటీ ద్వారా ప్రసారం చేయడాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన ఆ సినిమా దర్శకుడు పెట్రిక్, యూనిట్ సభ్యులకు పార్తీబన్ శుభాకాంక్షలు తెలియజేశారు.