English   

మళ్ళీ ఇదివరకటిలా షూటింగ్స్ జరుగుతాయా 

movie shootings
2020-05-19 11:44:54

ప్రపంచం అంతా ఇప్పుడు సైలెంట్ అయిపొయింది. కరోనా పుణ్యమా అని నిత్యం లేస్తే లైట్స్ యాక్షన్ అనే సౌండ్స్ వినే సినిమా జీవి ఇప్పుడు ఇళ్లకే పరిమితం అయ్యాడు. లాక్‌డౌన్‌ లో ఎన్ని సడలింపులు ఇచ్చినా, ఇప్పటికిప్పుడు భారీగా షూటింగులు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.  అయితే అంతా బాగుండి ఉంటే కనుక రిలీజ్ కి రెడీ అయిన నిశ్శబ్దం, వి, అరణ్య, రెడ్‌ తో పాటు షూట్ పార్ట్ కొంత మిగిలు ఉన్న వకీల్‌ సాబ్‌, క్రాక్‌, లవ్‌ స్టోరీ లాంటి సినిమాలు రిలీజ్ అయి ఉండేవి. కానీ కరోనా దెబ్బకి అంతా తల కిందులు అయిపొయింది. మన తెలుగు సినిమాలే కాదు హాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ దాకా ప్రపంచమంతా ఇదే స్థితి. అయితే, కరోనా వైర్‌స్ తోనే కలిసి జీవించాలని WHO సైతం చెబుతున్న క్రమంలో అసలిప్పుడు షూటింగులే సాధ్యం కావా ? అనే అనుమానాలు కూడా మొదలవుతున్నాయి. 

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో నెట్‌ ఫ్లిక్స్‌ కోసం ఒక వెబ్ సిరీస్‌ షూటింగ్‌, జనసంచారానికి దూరంగా జరుగుతున్నా, సెట్లోనే ప్రతిరోజూ ఆరోగ్య పరీక్షలు, మాస్కులు, శానిటైజర్లు వాడుతూ ఎంతో జాగ్రత్త పడుతూ ఆ వెబ్‌ సిరీస్‌ షూట్‌ జరుగుతోంది. అయితే, ఈ సేఫ్టీ వలన అసలు బడ్జెట్‌ కన్నా చాలా ఎక్కువ ఖర్చవుతోంది. ఆ ఖర్చును భరించడమే దారుణం అని అనుకుంటున్నారు ప్రొడక్షన్ వాళ్ళు. ఇలా చేయడం మన దగ్గర సాధ్యమేనా? అంటే కాదనే అంటున్నారు. అయితే ఇంత జరుగుతున్నా వర్మ మాత్రం ఆగకుండా సాహసించి, ఈ నెల మొదట్లో ఫీచర్‌ ఫిల్మ్‌ షూట్ చేసెసాడట. ఆ సంగతి ఆయన ఇంకా అధికారికంగా ప్రకటించకున్నా ఆ షూటింగ్‌ కరోనా ప్రికాషన్స్ తో జరిగిపోయిందని అంటున్నారు. అయితే మరి ఇంతకు ముందులాగా షూటింగ్స్ ఎప్పటికి మొదలవుతాయో ? ఏమో ?

More Related Stories