English   

చొక్కా లేకుండా మహేష్..మునుపెన్నడూ లేని విధంగా 

Mahesh Babu
2020-05-19 11:55:11

కరోనా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందర్నీ లాక్ డౌన్ పేరుతో ఇళ్లకే పరిమితం చేసేసింది. ఈ కరోనా సెలబ్రిటీ-సామాన్యుడు అనే తేడా లేకుండా అందరినీ ఇళ్లకే పరిమితం చేసింది. దీంతో షూటింగ్స్ పేరుతో దేశ విదేశాలకు వెళ్ళే సినీతారలు సైతం ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ కరోనా దెబ్బకు అందరూ ఫ్యామిలీస్ తో సమయం గడుపుతున్నారు. ఇలాంటి వేళ తమ ఇంట్లో జరుగుతున్న విశేషాలన్నీ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటున్నారు. మహేష్ బాబు చాలా సిగ్గరి అనే విషయం తెలిసిందే. అందుకేనేమో రీల్ లైఫ్ లోనే కాకుండా, రియల్ లైఫ్ లో కూడా ఆయన చొక్కా లేకుండా ఎప్పుడూ కనిపించ లేదు. అలాంటిది ఇప్పుడు ఆయన ఏకంగా చొక్కా లేని పిక్ ని షేర్ చేసింది నమ్రతా శిరోద్కర్ తన ఇన్ స్టాగ్రామ్ లో. ఇక ఈ పిక్ లో మహేష్ తన కూతురు సితారతో కలిసి స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేస్తూ కనిపిస్తున్నారు. ఈ పిక్ ని నమ్రత ఇలా పోస్ట్ చేసిందో లేదో అలా వైరల్ అయిపోయింది. ఈ పిక్ లో తాను ఈత కొడుతూ కూతురుకి కూడా ఈత నేర్పిస్తున్నారు ఆయన.  

More Related Stories