English   

పుట్టినరోజున వెలుగులోకి నవాజుద్దీన్ విడాకుల వ్యవహారం

 Nawazuddin Siddiqui
2020-05-19 12:10:41

బాలీవుడ్‌ విలక్షణ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అది కూడా సరిగ్గా ఆయన పుట్టిన రోజు నాడే ఆయన నుంచి విడాకులు కోరుతూ భార్య అలియా సిద్దిఖీ లీగల్‌ నోటీసులు పంపించారట. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ ఉన్న నేపథ్యంలో ఇ-మెయిల్‌, వాట్సాప్‌ల ద్వారా ఈ మేరకు మే 7నే నోటీసులు పంపినట్లు అలియా తరఫు లాయర్‌ వెల్లడించారు. అలాగే విడిపోయిన అనంతరం అలియాకు చెల్లించాల్సిన భరణం గురించి కూడా ఆ నోటీసుల్లో ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నవాజుద్దీన్ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. రంజాన్ సందర్భంగా తన కుటుంబంతో కలసివుండేందుకు ముంబయి నుంచి యూపీలోని బుధానాకు వెళ్లిన ఆయన్ను, క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించడంతో ఆయన హోం క్వారెంటైన్ లో ఉండిపోయారు. ఇక నవాజుద్దీన్‌, ఆయన కుటుంబంపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయన్న లాతర్ తాము పంపిన లీగల్‌ నోటీసులకు నవాజుద్దీన్‌ ఇంతవరకు స్పందించ లేదని అన్నారు. నవాజుద్దీన్‌, అలియా 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. నవాజుద్దీన్‌ గతంలో షీబా అనే ఆవిడను పెళ్లి చేసుకుని ఆమె నుంచి విడిపోయారు. 

More Related Stories