English   

అరుదైన వ్యాధితో బాధపడ్డానన్న సుస్మితా సేన్‌

Sushmita Sen
2020-05-19 12:22:21

తను ఒకానొక సమయంలో తాను ఓ అరుదైన వ్యాధితో తీవ్రమైన పోరాటం చేశానని మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌ సంచలన విషయాలు బయట పెట్టారు. తాజాగా లాక్ డౌన్ లో ఉన్న ఆమె తన వర్కౌట్లకు సంబంధించిన వీడియోలతో తరచూ నెటిజన్లను పలకరిస్తున్నారు. తాజాగా ఆమె ఒకప్పటి తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరిస్తూ ఓ వీడియో షేర్‌ చేశారు. సెప్టెంబర్‌ 2014 నుంచి తాను అడిసన్‌ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు ఆమె తెలిపింది. ఈ వ్యాధి గురించి ఆమె మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలు చాలా బాధపడ్డానన్న ఆమె స్టెరాయిడ్లుకు ప్రత్యామ్నాయంగా కార్టిసాల్‌ వాడానని  అయితే అవి చాలా నష్టాన్ని మిగిల్చాయని పెర్కొనటి. ఎన్ని చేసినా నయం కాకపోవడంతో మార్షల్‌ ఆర్ట్స్ నుంచక్ ని శరీరానికి అలవాటు చేశానని దానివలన నాలో నిజమైన శక్తి వచ్చిందని పేర్కొన్నారు. పెళ్లి చేసుకోని సుస్మితా సేన్  - రేనా, అలిషా అనే ఇద్దరు అమ్మాల్ని దత్తత  తీసుకుంది. వారికి సంబంధించిన పూర్తి బాధ్యతలను తనే తీసుకుంది. అయితే ప్రస్తుతం ఈ అందాల సుందరి తనకంటే 15ఏళ్లు చిన్నవాడైన మోడల్‌ రోహ్మాన్‌ షాల్‌ తో ప్రేమలో ఉంది.  

More Related Stories