English   

నాతూరాం గాడ్సే నిజమైన దేశభక్తుడు.. నాగబాబు కొత్త వివాదం..

Naga Babu
2020-05-19 14:44:44

నాగబాబు ఈ మధ్య వివాదాలతోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఒకప్పుడు చిరంజీవి తమ్ముడిగా క్రేజ్ తెచ్చుకున్నాడు.. ఆ తర్వాత నటుడిగా మారాడు. కొన్నేళ్లుగా జబర్దస్త్ లాంటి షోలకు జడ్జిగా ఉంటూ ఇమేజ్ పెంచుకున్నాడు. కానీ రెండేళ్లుగా సొంతంగా యూ ట్యూబ్ ఛానెల్ పెట్టుకుని అందులో మాట్లాడుతూ మరింత నిప్పు రాజేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు నాగబాబు. తాజాగా ఓ వివాదస్పద పోస్ట్ పెట్టాడు మెగా బ్రదర్. అందులో మహాత్మా గాంధీని కాల్చి చంపిన నాథూరాం గాడ్సే గురించి కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. మే 19 గాడ్సే పుట్టిన రోజు. గాంధీని గుర్తు పెట్టుకున్న ఈ దేశం గాడ్సే లాంటి నిజమైన దేశభక్తున్ని మరిచిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు ఈయన. 

'ఈ రోజు నాథూరాం గాడ్సే పుట్టిన రోజు. ఆయన నిజమైన దేశ భక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కాదా? అనేది చర్చనీయాంశం. అయితే అతని వైపు వాదనను ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది.(ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే) 'గాంధీని చంపితే ఆపఖ్యాతి పాలవుతానని తెలిసినా తను అనుకున్నది చేశాడు. కానీ, నాథూరాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తు చేసుకోవాలనిపించింది. పాపం నాథూరాం గాడ్సే. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్' అని తెలుగులో పోస్ట్ చేసాడు. నాగబాబు వ్యాఖ్యలపై కొందరు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు మాత్రం మండిపడుతున్నారు. మొత్తానికి ఈయన సృష్టించిన రచ్చ ఎలా మండుతుందో చూడాలిక. 

More Related Stories