English   

ఇండియన్ సినిమాలో తొలి లిప్ లాక్ సీన్ ముచ్చట..

First indian Movie liplock
2020-05-19 16:38:11

ఇప్పుడంటే లిప్ లాక్ సన్నివేశాలను లైట్ తీసుకుంటున్నారు కానీ ఒకప్పుడు మాత్రం ముద్దు సీన్స్ అంటే బూతుతో సమానం. ఆన్ స్క్రీన్ కిస్సింగ్ సీన్స్ కనిపిస్తే వామ్మో అనుకునే వాళ్లు. ఇమ్రాన్ హష్మి లాంటి హీరోలను పోర్న్ స్టార్స్ కింద చూసేవాళ్లు మన ప్రేక్షకులు. అలా ఉండేది పరిస్థితి. ఆ లెక్కన చూసుకుంటే ఇఫ్పుడు ప్రతీ ఒక్కరు పోర్న్ స్టార్సే ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు లిప్ లాక్ లేని సినిమాలు రావడం కష్టమే. ముద్దుతోనే అన్ని భావాలు పలికిస్తాం అంటున్నారు మన దర్శకులు. దాంతో హీరో హీరోయిన్లు కూడా లైట్ తీసుకుంటున్నారు. తెలుగులో కూడా లిప్‌లాక్స్ అనేవి కామన్ అయిపోయాయి. అలాంటిది దాదాపు 90 ఏళ్ల కింద ఇండియన్ సినిమాలో తొలి లిప్‌లాక్ గురించి మీకు తెలుసా..? 1933లో కర్మ అనే బాలీవుడ్ చిత్రంలో తొలి లిప్‌లాక్ సీన్‌ను చిత్రీకరించారు. హీరోయిన్ దేవికారాణి ఈ సీన్ లో నటించింది. అయితే ఈ సీన్ చేసింది ఆమె తన భర్తతోనే. కానీ అప్పట్లో దేవికాపై ఎన్నో విమర్శలు వచ్చాయి.. అసలు సిగ్గుందా.. ఆచారాలను మంట కలుపుతున్నారంటూ మండి పడ్డారు. కానీ ఇప్పుడు మాత్రం లిప్ లాక్ చాలా అంటే చాలా కామన్ అయిపోయింది. 

More Related Stories