English   

జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్స్ ఎలా ఉండబోతున్నాయంటే..

NTR
2020-05-19 17:26:20

జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే కోసం కొన్నాళ్లుగా కళ్ళలో ఒత్తులేసుకుని మరీ చూస్తున్నారు నందమూరి అభిమానులు. కానీ వాళ్ల ఎదురు చూపులపై లాక్ డౌన్ నీళ్లు చల్లితే.. రాజమౌళి ఆవిరి చేసాడు. ట్రిపుల్ ఆర్ టీజర్ లేదని చెప్పేసాడు. దాంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా నిరాశలో మునిగిపోయారు. కానీ జూనియర్ మాత్రం తన అభిమానులకు అదిరిపోయే గిఫ్టులు సిద్ధం చేస్తున్నాడు. మే 20న ఈయన పుట్టిన రోజు సందర్భంగా వరసగా అప్ డేట్స్ వస్తున్నాయి. ఆ రోజంతా సందడి కనిపించబోతుంది. అలా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ముఖ్యంగా ఆ రోజు నాలుగు మేజర్ సర్ ప్రైజులు ప్లాన్ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్.

టీజర్‌కు బదులుగా జూనియర్ ఎన్టీఆర్ వర్కింగ్ స్టిల్స్ కొన్ని విడుదల చేయాలని చూస్తున్నారు ట్రిపుల్ ఆర్ టీం. ఇక ప్రత్యేకమైన జిమ్ ట్రైనింగ్ వీడియో ఒకటి విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిమ్ ట్రైనర్ కూడా కన్ఫర్మ్ చేసాడు. మే 20 ఉదయం ఇది విడుదల కానుంది. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాల్లోంచి ఎవరికీ తెలియని స్టిల్స్ కొన్ని విడుదల చేయనున్నారు. మరో మేజర్ అప్‌డేట్ ఏంటంటే ప్రశాంత్ నీల్ సినిమాపై కూడా కీలకమైన న్యూస్ రానుందని ప్రచారం జరుగుతుంది. త్రివిక్రమ్ సినిమా గురించి కూడా ఓ అప్ డేట్ రానుంది. మొత్తానికి లేని టీజర్ స్థానంలో ఇన్ని పెట్టి ఆ లోటు భర్తీ చేస్తున్నాడు జూనియర్. మే 20, 2020తో 37 పూర్తి చేసుకుని.. 38వ వడిలోకి అడుగు పెడుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్.

More Related Stories