English   

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అదిరే గిఫ్ట్..సిక్స్ ప్యాక్ లుక్

jrntr
2020-05-19 19:35:19

హీరోలలో కొంత మంది పాత్ర పాత్రకి వేరియేషన్స్ చూపించడమే కాక దానికి బాడీని మౌల్ద్ చేసే వారు ఉంటారు. అలా ఉండే హీరోలు అతి కొద్ది మందే ఉంటారని చెప్పచ్చు. అలాంటి వారిలో ఎన్టీఆర్ ఒకరు. ఈ మధ్య స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకు బాడీ షేపింగ్స్ పై దృష్టి పెడుతున్నారనుకోండి అది వేరే విషయం. ఇక అరవింద సమేత సినిమా నుండి ఎన్టీఆర్ టాప్ జిమ్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఆధ్వర్యంలో జిమ్ చేసి తన బాడీని షేపింగ్ చేయించుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన ఆర్ఆర్ఆర్ కోసం కూడా ఆయననే కంటిన్యూ చేశారు. తాను ఒక్కడే కాక ఆ సినిమాలో తన కో యాక్టర్ రామ్ చరణ్ ని కూడా ఆయనకే అప్పచెప్పాడు. ఇక ఆ ట్రైనర్ వర్క్ మీద జక్కన్న చాలా సంతృప్తిగా ఉన్నాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి.

ఆ విషయం పక్కన పెడితే రేపు ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో ఆయన అభిమానులు ఆశగా చూస్తున్నారు. ఎందుకంటే ఆయన పుట్టిన రోజుకు టీజర్ రాకపోయినా సర్‌ప్రైజులు చాలా ఉంటాయని హింట్స్ ఇచ్చారు. అందుకే జిమ్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. ఆయన ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ తో ఉన్న పిక్ ని షేర్ చేశాడు. ఆయన పిక్ రిలీజ్ కావడంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. టెంపర్ సినిమా కోసం ఒక పాటలో సిక్స్ ప్యాక్ తో కనిపించాడు జూనియర్. అయితే ఆ సినిమా తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఈయన అలా కనిపించ లేదు జక్కన్న పుణ్యమా అని మళ్ళీ ఆయన ఆ లుక్ లో కనిపిస్తున్నాడు.

 

More Related Stories