బోనీ కపూర్ ఇంట్లో కరోనా కలకలం

బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఇంట్లో కరోన కలకలం రేగింది. ఆయన ఇంట్లో పని చేసే ఓ యువకుడికి కరోనా పాజిటీవ్ వచ్చినట్లు బిఎమ్సి ( బృహత్ ముంబై మునిసిపల్ కార్పోరేషన్) అధికారులు తెలిపారు. దీంతో ఒక్క సారిగా కలకలం రేగింది. నెటిజన్లు బోణీ ఫ్యామిలీకి ఏమయిందని ఖంగారు పడుతుండడంతో బోనీ స్వయంగా స్పందించారు. నేను పిల్లలందరం బాగానే ఉన్నామని, మాలో ఎటువంటి లక్షణాలు లేవు. ఆరోగ్యంగానే ఉన్నామని అన్నారు. లాక్డౌన్ ప్రారంభమైన నాటి నుంచి మా ఇంటిని విడిచి వెళ్లలేదని ఆయన పేర్కొన్నారు. అలాగే మహారాష్ర్ట ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలను తప్పక పాటిస్తున్నామని గత శనివారం నుంచి మా ఇంట్లో పనిచేసే వ్యక్తికి నలతగా ఉందని ఎందుకయినా మంచిదని మేమే అతన్ని పరీక్ష కోసం పంపామని పేర్కొన్నారు. త్వరలోనే అతను కోలుకొని ఇంటికి వస్తాడని ఆశిస్తున్నామని బోనీ చెప్పుకొచ్చారు. శ్రీ దేవి మరణం తరువాత బోనీ ముంబై, అంధేరిలోని గ్రీన్ ఏకర్స్ అపార్ట్ మెంట్స్ లో కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్లతో కలిసి నివస్తున్నారు.