English   

ఎన్టీఆర్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన ఆస్ట్రేలియన్ క్రికెటర్..

ntr
2020-05-19 20:20:08

లాక్ డౌన్ పుణ్యమా అని ఇప్పటికే మొదలవ్వాల్సిన ఐపీఎల్ మొత్తం నాశనం అయిపోయింది. దాంతో ఈ సారి క్రికెట్ ప్రియులకు చేదు వార్తలే ఎదురయ్యాయి. దాంతో హైదరాబాద్ వచ్చి ఇక్కడే ఉండిపోయాడు సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్. ఖాళీగా ఉండటం ఎందుకు అనుకున్నాడో ఏమో కానీ ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కు చేరవయ్యే పనిలో పడ్డాడు డేవిడ్. ముఖ్యంగా తెలుగు హీరోలతో పాటు దర్శకులతో కూడా స్నేహం పెంచుకుంటున్నాడు. ఇప్పటికే అల వైకుంఠపురంలో పాటలతో పాటు పోకిరి, బాహుబలి డైలాగ్స్ కూడా చెప్పాడు డేవిడ్ వార్నర్. ఇప్పుడు మరోసారి రచ్చ చేసాడు ఈయన. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపాడు వార్నర్. ఎన్టీఆర్ అభిమాని ఒకరు వార్నర్ భాయ్ మా అభిమాన హీరోకి విషెస్ చెప్పరా అని అడిగితే వెంటనే చెప్పేసాడు ఈయన.  హ్యాపీ బర్త్ డే బడ్డీ అంటూ జూనియర్ కు విషెష్ చెప్పాడు ఈయన. ఇప్పటికే వార్నర్ కు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పాడు. మొత్తానికి ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కూడా వార్నర్ బాగా చేరువైపోయాడు.

 

More Related Stories