English   

హ్యాపీ బర్త్ డే టూ మంచు మనోజ్..

manoj
2020-05-20 07:04:36

మంచు మనోజ్.. పరిచయం అక్కర్లేని పేరు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు ఈయన. హిట్స్ వస్తేనే క్రేజ్ ఉంటుంది అనుకోవడం పొరపాటే. మనోజ్ కు హిట్స్ ఫ్లాపులతో సంబంధం లేకుండా గుర్తింపు తెచ్చుకున్నాడు. భిన్నమైన సినిమాలు చేసుకుంటూ ఇప్పటి వరకు కెరీర్ నడిపించాడు ఈయన. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 16 ఏళ్లైపోతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు స్టార్ అనే ముద్ర రాలేదు.. కానీ ప్రయత్నం మాత్రం ఆపడం లేదు. ఈయన 2020, మే 19తో 37 వసంతాలు పూర్తి చేసుకుని 38లోకి అడుగు పెడుతున్నాడు. కొన్నేళ్లుగా ఈయన సినిమాలకు దూరంగా ఉన్నాడు. మూడేళ్ల కింద వచ్చిన ఒక్క‌డు మిగిలాడు తర్వాత ఇప్పటి వరకు మరో సినిమా చేయలేదు. ఒక్క‌డు మిగిలాడు శ్రీ‌లంక‌ శ‌ర‌ణార్థుల నేప‌థ్యంలో తెర‌కెక్కిన సినిమా. ఇందులో ఎల్టీటీఈ ప్రభాక‌ర‌న్ గెట‌ప్ లో క‌నిపించాడు మ‌నోజ్. ఈ పాత్ర‌కు ప్ర‌శంస‌లు దక్కాయి. కానీ ఏం చేస్తాం.. అదృష్ట‌మే క‌లెక్ష‌న్ కింగ్ త‌న‌యుడిని చిన్న చూపు చూస్తుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు.

. ఈ ప‌దేళ్ల‌లో డ‌జ‌న్ సినిమాల‌కు పైగా చేసాడు మ‌నోజ్. వీటిలో ఒక్క బిందాస్ మిన‌హాయిస్తే మ‌రో చెప్పుకోద‌గ్గ హిట్ లేదు. ప్ర‌యోగాలు చేస్తాడు.. కొత్త‌ద‌నాన్ని ఎంకరేజ్ చేస్తాడు.. రియ‌ల్ స్టంట్స్ తో దుమ్ము దులిపేస్తాడ‌నే మంచి పేరు తెచ్చుకున్న మ‌నోజ్.. స్టార్ స్టేట‌స్ అయితే ద‌క్కించుకోలేదు. వేదం, ప్రయాణం, నేను మీకు తెలుసా, ఝుమ్మంది నాదం లాంటి సినిమాలు బాగానే ఉన్నా హిట్ మాత్రం కాలేదు. సినిమాలో విష‌యం ఉన్నా.. అది స‌రైన ప‌ద్ద‌తిలో తీయ‌లేక‌పోయారంటున్నారు ప్రేక్ష‌కులు. మ‌నోజ్ వ‌ర‌కు అంతా బానే ఉన్నా.. సినిమా తెర‌కెక్కిన విధానంపైనే అంతా వేలెత్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం అహం బ్రహ్మాస్మీ అంటూ వస్తున్నాడు మనోజ్. సొంత నిర్మాణ సంస్థలోనే ఈ చిత్రం చేస్తున్నాడు మనోజ్. కచ్చితంగా ఈ చిత్రంతో కమ్ బ్యాక్ ఇస్తానని చెబుతున్నాడు. మరి ఈయన ఈ పుట్టిన రోజుకు అయినా మంచి హిట్ కొట్టాలని చూస్తున్నారు అభిమానులు.

More Related Stories