English   

సినిమా ఇండస్ట్రీకి జగన్ ప్రభుత్వం వరాల జల్లు..

jagan
2020-05-20 07:18:54

ఏపీలో సినిమా, టీవీ షూటింగ్ ప్రక్రియను సులభం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సినిమా టివి, మరియు థియేటర్ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సింగిల్ విండో సిస్టం ఏర్పాటు చేసింది. గతంలో సంస్థ ఎండి ఇచ్చిన సూచనల మేరకు 2006లో ఇచ్చిన జీవో ms2 కు సవరణలు చేసింది ప్రభుత్వం. నిర్మాణ సంస్థలను ప్రోత్సహించేందుకు సినీ, మరియ టెలివిజన్ రంగాలకు ఉచితంగా షూటింగ్ అనుమతులు ఇచ్చేసింది.  గతంలో నిర్ణయించిన ఫీజులను కషన్ డిపాజిట్లను కార్పొరేషన్ కు చెల్లించి షూటింగ్ ముగిసిన అనంతరం వాటిని రీఫండ్ చేయనుంది ప్రభుత్వం. సంస్థ ఎండి సూచనల మేరకు రాష్ట్రంలో మరిన్ని ప్రాంతాల్లో షూటింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేయనున్నారు.

కేటగిరి 1 ( రోజుకి కాషన్ డిపాజిట్ 15వేలు):

రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి సంస్థ ఆధీనంలో ఉన్న పార్కుల్లో షూటింగ్‌కు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది ప్రభుత్వం. పట్టణాభివృద్ధి సంస్థ పార్కులు,మునిసిపల్ కార్పొరేషన్ అధీనంలో ఉన్న పార్కులలో షూటింగ్ కు అనుమతి ఇస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ మ్యూజియం,బిల్డింగ్ లు,పాఠశాలలు మరియు కాలేజీలలో షూటింగ్ కు అనుమతి ఇచ్చారు.

కేటగిరి 2 (రోజుకి కాషన్ డిపాజిట్ 10వేలు) :

రాష్ట్రంలోని అన్ని ఆలయాలు, విశాఖపట్నం, తిరుపతి జూ పార్కులు, ఎపిటిడిసి ఆధ్వర్యంలో ఉన్న సరస్సులు, ఉద్యానవనాలు, జిల్లా కేంద్రాల్లోని పాఠశాలలు, కాలేజీలు, విజయవాడలోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీలలో షూటింగ్ చేసుకోవచ్చంటూ అనుమతి ఇచ్చింది జగన్ ప్రభుత్వం.

కేటగిరి 3 (రోజుకి కాషన్ డిపాజిట్ 5 వేలు):

మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని రోడ్లు, పార్కులు, బీచ్ లు, అలిపిరి గార్డెన్స్ తో సహా అన్ని పార్కుల్లో షూటింగ్ అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఏపీటిడిసి,ఆర్&బి, ఇరిగేషన్ శాఖల లొకేషన్స్ లో షూటింగ్ కు అనుమతి ఇచ్చారు. దీనివల్ల ఏపీలో సినిమా పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాడు వైఎస్ జగన్.

More Related Stories