English   

జూనియర్ ఎన్టీఆర్ అందుకున్న తొలి పారితోషికం ఎంతంటే..

ntr
2020-05-20 07:52:00

జూనియర్ ఎన్టీఆర్ కు ప్రస్తుతం తెలుగులో ఎంత క్రేజ్ ఉందనేది లెక్కలేయడం కష్టమే. ఎందుకంటే ఈయన సినిమా వచ్చిందంటే బాక్సాఫీస్ బద్ధలైపోతుంది. గత ఐదేళ్లుగా వరస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం రాజమౌళి అండతో వస్తున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అభిమానులు ఈయన పుట్టిన రోజు మాయలో ఉన్నారు. మే 20న జూనియర్ బర్త్ డే. దాంతో సోషల్ మీడియా అంతా జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఫోటోలు.. అతడి విషయాలతో సందడిగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆయన హీరోగా నటించిన తొలి సినిమాకు తీసుకున్న పారితోషికం గురించి చర్చ నడుస్తుంది. బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన ఎన్టీఆర్.. మూడేళ్లు గ్యాప్ తీసుకుని 2001లో నిన్ను చూడాలని సినిమాతో ఇండస్ట్రీకి వచ్చాడు. ఈ సినిమా ఫ్లాప్ అయింది కానీ నటుడిగా మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాను ఉషా కిరణ్ మూవీస్ నిర్మించింది. ఈ సినిమాలో నటించినందుకు గానూ ఎన్టీఆర్ కు 4 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చాడు రామోజీ రావు. అప్పటికి ఎన్టీఆర్ కు ఓటు హక్కు కూడా రాలేదు. దాంతో ఆ 4 లక్షలు ఏం చేయాలో తెలియక తల్లికి బహుమతిగా ఇచ్చాడు జూనియర్. ఆ తర్వాత రెండేళ్లలోనే ఆది, సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్స్ అందుకొని స్టార్ హీరోగా ఎదిగాడు ఎన్టీఆర్. ఇప్పుడు ఈయన ఒక్కో సినిమాకు కనీసం 30 కోట్లకు పైగానే తీసుకుంటున్నాడు.

 

More Related Stories