English   

బాలయ్య మంచివాళ్లకు మంచివాడంటున్న ఛార్మి..

nbk
2020-05-20 08:01:01

హీరోయిన్‌గా ఇక సినిమాలు చేయనని.. నటిగా తన ప్రస్థానం ముగిసిందంటూ ఈ మధ్యే అనౌన్స్ చేసింది ఛార్మి. ప్రస్తుతం ఈమె సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉంది. ఆయనకు తోడుగా పూరీ జగన్నాథ్ కూడా ఉన్నాడు. ఇదిలా ఉంటే ఈమె తాజాగా బాలయ్యపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే అల్లరి పిడుగు సినిమాలో బాలయ్యతో హీరోయిన్ గా నటించింది ఛార్మి. అప్పటికి ఇప్పటికీ ఈయన ఏం మారలేదని.. ఎప్పుడూ అదే స్వీట్ నెస్ అంటుంది ఛార్మి. ముఖ్యంగా తాను చూసిన వాళ్లలో బాలయ్య చాలా మంచి వాడు అంటూ సర్టిఫికేట్ ఇచ్చింది ఈ బ్యూటీ. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చిన ఛార్మి.. నందమూరి బాలకృష్ణ గురించి ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించింది. బాలకృష్ణ మంచి మనసున్న మనిషి అంటూ చెప్పుకొచ్చింది ఈమె. అల్లరి పిడుగు సమయంలోనే తనకు బాలయ్యతో పరిచయం ఏర్పడిందని.. ఇక పైసా వసూల్ అప్పుడు మరింత సాన్నిహిత్యం వచ్చిందంటుంది ఈమె. ఎప్పుడూ సెట్ లో పాజిటివ్ గా ఉండటం.. దర్శకుడితో పాటు టీంతో కూడా సరదాగా ఉండటం బాలయ్యకు మాత్రమే సాధ్యమంటుంది ఛార్మి. ఆయన ఎనర్జీ అందరికీ ట్రాన్స్ ఫర్ అవుతుందని చెబుతుంది ఈమె. ఆయనతో సినిమా చేయడానికి పూరీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడని.. కథ కుదిర్తే త్వరలోనే చేస్తారని చెప్తుంది. ఇద్దరి మధ్య మంచి అనుబంధముందని గుర్తు చేసింది ఛార్మి.

 

More Related Stories