English   

డియర్ బ్రదర్.. తారక్‌కు మహేష్ బాబు విషెస్..

Jr NTR
2020-05-20 15:50:16

నందమూరి చిన్నోడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా అంతా షేక్ అయిపోతుంది. ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు అంతా తారక్ కు శుభాకాంక్షలు తెలిపారు. హీరోలు, దర్శకులతో పాటు నిర్మాతలు, స్నేహితులు కూడా ఈయనకు గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో విషెస్ చెప్తూనే ఉన్నారు. చిరంజీవి, రామ్ చరణ్ సహా అందరూ జూనియర్ ఎన్టీఆర్ కు విషెస్ తెలిపారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈయనకు బర్త్ డే విషెస్ చెప్పాడు. డియర్ బ్రదర్ అంటూ ఆప్యాయంగా పలకరించాడు మహేష్ బాబు. ఈ ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. మహేష్ బాబును అన్న అని పిలుస్తుంటాడు జూనియర్. ఆ మధ్య భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు కూడా వచ్చాడు జూనియర్. అప్పుడే చెప్పాడు.. మేం మేం బాగానే ఉంటాం.. మీరే ఇంకా బాగుండాలని. అప్పట్నుంచి ఇదే స్నేహం కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కూడా నీవు ఇంకా బాగుండాలి బ్రదర్.. అంతా నీకు కలిసిరావాలి అంటూ ట్వీట్ చేసాడు సూపర్ స్టార్. మహేష్ బర్త్ డే విషెస్ కూడా వైరల్ అవుతున్నాయి. 

More Related Stories